Punjab Toll Plaza Blunder : ఇదెక్కడి బాదుడు బాబోయి.. ఇంట్లో ఉన్నా ఫాస్ట్ ట్యాగ్ ఛార్జీలు.. టోల్ ప్లాజా తప్పిదానికి యూజర్ షాక్..!

Punjab Toll Plaza Blunder : పంజాబ్‌ టోల్ ప్లాజాలో ఘోర తప్పిదం జరిగింది. పంజాబ్‌కు చెందిన నివాసి ఇంట్లో ఉండగానే అతడి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో టోల్ ఛార్జ్ పడింది. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు.

Punjab Toll Plaza Blunder : ఇదెక్కడి బాదుడు బాబోయి.. ఇంట్లో ఉన్నా ఫాస్ట్ ట్యాగ్ ఛార్జీలు.. టోల్ ప్లాజా తప్పిదానికి యూజర్ షాక్..!

Punjab Toll Plaza Blunder _ Man Charged Rs 220 While Relaxing At Home ( Image Source : Google )

Updated On : August 15, 2024 / 10:07 PM IST

Punjab Toll Plaza Blunder : సాధారణంగా వాహనం టోల్ ప్లాజా దాటి వెళ్లినప్పుడే టోల్ ఛార్జీ పడుతుంది. కానీ, పంజాబ్‌ టోల్ ప్లాజాలో ఘోర తప్పిదం జరిగింది. పంజాబ్‌కు చెందిన నివాసి ఇంట్లో ఉండగానే అతడి ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో టోల్ ఛార్జ్ పడింది. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అనుమానాస్పద ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీని గుర్తించాడు.

Read Also : Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఈ స్కిల్ ఉంటే లక్షల జీతంతో ఆఫీసర్ అయ్యే ఛాన్స్!

తాను ఇంట్లో ఉన్నప్పటికీ తన అకౌంట్ నుంచి అనధికారికంగా రూ. 220 టోల్ ఛార్జ్ చేసినట్టుగా నివేదించాడు. సుందర్‌దీప్ సింగ్ అనే వ్యక్తి టోల్ ఛార్జీ లావాదేవీ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఆగస్ట్ 14, 2024న మధ్యాహ్నం 2 గంటలకు లాడోవాల్ టోల్ ప్లాజాలో ఛార్జీ విధించినట్టు చూపిస్తుంది. ఈ నెలలో తాను ఆ మార్గంలో ప్రయాణించలేదని, ఛార్జీ చెల్లుబాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

“హాయ్, ఫాస్ట్‌ట్యాగ్ ఎన్‌ఈటీసీ.. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయి. ఈ నెలలో కూడా ఆ మార్గంలో ప్రయాణించలేదు. ఏమి జరుగుతోంది?” అని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆందోళన వ్యక్తం చేశాడు. టోల్ ఫీ కట్ అయిన తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో మిగిలిన బ్యాలెన్స్ రూ. 790 అని స్క్రీన్‌షాట్ కనిపిస్తోంది.

స్పందించిన ఎన్‌ఈటీసీ :
బాధితుడి ఫిర్యాదుపై ఎన్‌ఈటీసీ స్పందించింది. ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ డెస్క్‌ని సందర్శించి సమస్యను తెలియజేయాల్సిందిగా సింగ్‌ని కోరింది. అతని ఫిర్యాదును రివ్యూ చేస్తామని తెలిపింది. అది తప్పు అని తేలితే.. అకౌంట్లో జరిగిన లావాదేవీ మొత్తం తిరిగి రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చింది.

“హాయ్, ఫాస్ట్ ట్యాగ్ తప్పుగా జరిగినట్టు రిపోర్టు చేయడానికి దయచేసి జారీ చేసిన బ్యాంక్ కస్టమర్ సర్వీస్ డెస్క్‌ని సంప్రదించండి. వారు మీ ఫిర్యాదును రివ్యూ చేస్తారు. దాని మెరిట్ ఆధారంగా తప్పుగా విధించిన ఛార్జీలను రీఫండ్ చేస్తారు ధన్యవాదాలు,” ఫాస్ట్ ట్యాగ్ ఎన్ఈటీసీ విభాగం బదులిచ్చింది. ట్విట్టర్‌లో బాధితుడు చేసిన పోస్టుకు దాదాపు 6 లక్షల వ్యూస్ రావడంతో వైరల్‌గా మారింది. చాలా మంది వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగానే జరిగి ఉంటుందని అంటున్నారు.

Read Also : Independence day 2024 : దేశాలు వేరైనా మనమంతా ఒక్కటే.. జెండా పండుగ రోజున ‘జయహో’ అంటున్న భారత్, పాకిస్థానీలు