Jawa 42 Bike Launch : కొత్త జావా 42 అడ్వెంచర్ బైక్ భలే ఉందిగా.. మొత్తం 6 కలర్ ఆప్షన్లలో.. ధర ఎంతంటే?
Jawa 42 Bike Launch : జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ నుంచి సరికొత్త 2024 జావా 42 బైకు వచ్చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Jawa 42 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? ప్రముఖ టూవీలర్ కంపెనీ జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ నుంచి సరికొత్త 2024 జావా 42 బైకు వచ్చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 1.73 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందించనుంది. ఈ మోటార్‌సైకిల్‌కి కొత్త ఇంజన్, 6 కొత్త ఆప్షన్‌లతో 14 పెయింట్ స్కీమ్‌లు, 42కి పైగా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.
కొత్త జావా 42లో 294సీసీ, జే-పాంథర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. 27.32పీఎస్, 26.84ఎన్ఎమ్ అభివృద్ధి చెందుతుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఎంటీతో వస్తుంది. కొత్త జావా 42కి గేర్-ఆధారిత థొరెటల్ మ్యాపింగ్, అసిస్ట్ అండ్ స్లిప్ (ఏ&ఎస్) క్లచ్‌ని యాడ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. లేటెస్ట్ ఇంజన్ అప్‌గ్రేడ్‌లో భారీ మాగ్నెటో, బిగ్ థొరెటల్ బాడీ, ఎంట్రీ డక్ట్ సీపీ4 సిలిండర్ హెడ్ ఉన్నాయి.
“2024 సరికొత్త బైక్ జావా మోటార్‌సైకిల్ 2వ, 3వ, 4వ గేర్లు ఇప్పుడు షిఫ్టింగ్ స్మూత్‌నెస్‌తో మెరుగైన డ్రైవబిలిటీకి ఆప్టిమైజ్ చేసింది. రీడిజైన్ చేసిన బ్యాలెన్సర్ బరువు, కొత్త హబ్-టైప్ బ్యాలెన్సర్ గేర్ వైబ్రేషన్‌లను తగ్గిస్తుంది” అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. 2024 అవతార్‌లో జావా 42 మాట్టే, గ్లోస్ ఆప్షన్లను కలిగిన 14 కలర్ ఆప్షన్లను పొందుతుంది.
ఇందులో వేగా వైట్, వాయేజర్ రెడ్, ఆస్టరాయిడ్ గ్రే, ఒడిస్సీ బ్లాక్, నెబ్యులా బ్లూ, సెలెస్టియల్ కాపర్ మ్యాట్ ఆరు కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కన్వర్టర్ సిలిండర్ హెడ్‌కు సమీపంలో ఉంది. కంపెనీ ఇంజిన్‌ను కూడా రీమ్యాప్ చేసింది. ఫలితంగా లిక్విడ్-కూల్డ్ యూనిట్ ఇప్పుడు 27bhp, 26.84 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు కూడా మార్పులు చేసింది. ఇప్పుడు సులభంగా మారడానికి స్లిప్, అసిస్ట్ క్లచ్ కూడా ఉన్నాయి.
2024 జావా 42 హార్డ్‌వేర్ అండ్ ఫీచర్లు :
కొత్త జావా 42 అదే డ్యుయల్-క్రెడిల్ ఫ్రేమ్ ద్వారా వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు, రీట్యూన్డ్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు మెరుగైన డంపింగ్ రీ-అడ్జస్ట్ చేసిన మౌంటింగ్ పాయింట్‌లను కలిగి ఉంది. రీట్యూన్ చేసిన సస్పెన్షన్ 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 785మిమీ సీటు ఎత్తు ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ద్వారా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అందిస్తాయి. బైక్ వైర్-స్పోక్, అల్లాయ్ వీల్స్ రెండింటితో అందిస్తుంది. మరో ముఖ్యమైన మార్పు 42 బాబర్, యెజ్డీ రేంజ్ నుంచి ఫుల్-డిజిటల్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంది.
Read Also : Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. ఆగస్టు 15నే లాంచ్.. డిజైన్, ఫీచర్లు భలే ఉన్నాయిగా..!