Royal Enfield Classic 350 : డుగ్ డుగ్ బుల్లెట్ బండి వస్తోంది.. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 లాంచ్ ఎప్పుడంటే? ఫీచర్లు చూస్తే ఫిదానే..!
Royal Enfield Classic 350 Launch : ఈ బుల్లెట్ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్‌లు అదే రోజున ప్రారంభమవుతాయి. 2024 క్లాసిక్ 350 మొత్తం 5 కొత్త వేరియంట్‌లలో రానుంది.
Royal Enfield Classic 350 Launch : కొత్త బైక్ కొంటున్నారా? ప్రముఖ టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసిన మోటార్‌సైకిల్ సెప్టెంబర్ 1న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ బుల్లెట్ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్‌లు అదే రోజున ప్రారంభమవుతాయి. 2024 క్లాసిక్ 350 మొత్తం 5 కొత్త వేరియంట్‌లలో లభిస్తుంది. అందులో హెరిటేజ్, హెరిటేజ్ ప్రీమియం, సిగ్నల్స్, డార్క్, ఎమరాల్డ్ అనే 7 కలర్ ఆప్షన్లు ఉంటాయి.
Read Also : Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. ఆగస్టు 15నే లాంచ్.. డిజైన్, ఫీచర్లు భలే ఉన్నాయిగా..!
హెరిటేజ్ వేరియంట్‌లో మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ అనే రెండు ఉన్నాయి. హెరిటేజ్ ప్రీమియం మెడాలియన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. సిగ్నల్స్ వేరియంట్ కమాండో శాండ్‌లో లభిస్తుంది. డార్క్ వేరియంట్ గన్ గ్రే (గ్రే, బ్లాక్ కలర్ డ్యూయల్ టోన్ స్కీమ్‌తో కాపర్ హైలైట్), స్టెల్త్ బ్లాక్ (బ్లాక్ ఆన్ బ్లాక్ స్కీమ్) కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. టాప్-స్పెక్ ఎమరాల్డ్ క్రోమ్, కాపర్ పిన్‌స్ట్రైప్‌తో కూడిన రీగల్ గ్రీన్ కలర్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. :
2024 క్లాసిక్ 350 కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్, లెజెండరీ టియర్‌డ్రాప్ ట్యాంక్, క్లస్టర్‌పై గేర్ పొజిషన్ ఇండికేటర్, టైప్-సి యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్‌తో అత్యుత్తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్యారెక్టర్‌ను అందిస్తుంది. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డార్క్, ఎమరాల్డ్ వేరియంట్‌లు ఎడ్జెస్టబుల్ లివర్, ఎల్ఈడీ వింకర్‌లతో పాటు ట్రిప్పర్ పాడ్ స్టాండర్డ్ ఫిట్‌మెంట్ ఉన్నాయి.
మోటార్‌సైకిల్ జే-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా జే-సిరీస్ ఇంజిన్‌ను కొనసాగిస్తోంది. 349సీసీ, ఎయిర్-ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 20.2bhp పవర్, 27ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 41ఎమ్ఎమ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ ట్విన్-ట్యూబ్ ఎమల్షన్ షాక్‌లతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్‌ని ఉపయోగించారు. మీరు కొనుగోలు చేసే వేరియంట్‌పై ఆధారపడి ఫ్రంట్ సైడ్ 19-అంగుళాల వీల్ (అల్లాయ్/స్పోక్), బ్యాక్ సైడ్ 18-అంగుళాల వీల్ (అల్లాయ్/స్పోక్) పొందవచ్చు.
ఫ్రంట్ సైడ్ 300ఎమ్ఎమ్ డిస్క్ ఉండగా, బ్యాక్ సైడ్ 270ఎమ్ఎమ్ డిస్క్ లేదా 153ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అంతేకాకుండా, మోటార్‌సైకిల్ సింగిల్ ఛానల్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. అవుట్‌గోయింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉండగా, 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర పెరిగే అవకాశం ఉంది.
Read Also : Jawa 42 Bike Launch : కొత్త జావా 42 అడ్వెంచర్ బైక్ భలే ఉందిగా.. మొత్తం 6 కలర్ ఆప్షన్లలో.. ధర ఎంతంటే?