KTR Comments : మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు!
KTR Comments : మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
KTR Comments : తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. శుక్రవారం (ఆగస్టు 16) రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం చేయాలని సూచించింది.
Read Also : చంద్రబాబా మజాకా..! టీడీపీ కంచుకోటలో వైసీపీ కథ కంచికేనా? దారుణంగా దెబ్బతీసిన వైనాట్ 175..!
తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్‌లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్‌లు చేయండని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడతారా? అని ధ్వజమెత్తారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కేటీఆర్ మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు.. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం.
Read Also : బీఆర్ఎస్‌ను తిడితేనో, ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్దాలు నిజాలైపోవు- సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్