Peddha Kapu 1 : మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ సామజిక వర్గం గురించేనా..?

శ్రీకాంత్ అడ్డాల 'పెద్ద కాపు' అని టైటిల్ ఎందుకు పెట్టాడు..? ఆ సామజిక వర్గం గురించేనా..?

Peddha Kapu 1 : మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ సామజిక వర్గం గురించేనా..?

Srikanth Addala Reveals Fact Behind Peddha Kapu Title

Peddha Kapu 1 : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం ‘పెద్ద కాపు’. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక మొదటి భాగం సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు..? ఆ సామజిక వర్గం గురించేనా..? అనే సందేహం అందరిలో నెలకుంది.

Waheeda Rehman : తమిళ నటి వహీదా రెహ్మాన్.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌లో బిగ్ స్టార్‌గా..

అయితే ఈ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కథ ఏంటో శ్రీకాంత్ అడ్డాల తెలియజేశాడు. ఈ మూవీ లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు ఒక ఊరిలోని బస్సు స్టాండ్ షెల్టర్ పై ఒక పేరు చూశాడట. ఆ పేరులో రెడ్డి, పెద్దకాపు అనే రెండు పదాలు కనిపించాయి. అది చూసిన శ్రీకాంత్ అడ్డాలకి ఒక సందేహం కలిగి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని తన డౌట్ అడిగాడట. ‘రెడ్డిలో కూడా కాపు ఉంటాడా..?’ అని తన డౌట్ అడిగాడు. దానికి ఆ వ్యక్తి బదులిస్తూ.. ‘పెద్ద కాపు అంటే కులం కాదు, అది ఒక బిరుదు’ అని చెప్పాడట.

Jawan : జవాన్ యాక్షన్ సీన్ ఎలా షూట్ చేసారో చూశారా..? కారుని గాలిలోకి..!

ఒక వ్యక్తి నలుగురికి పని కల్పించి, తాను పనిలోకి దిగితే అతనిని పెద్దకాపు అని పిలుస్తారని చెప్పాడట. ఈ మూవీ కథ కూడా కొంచెం దానికి తగ్గట్టే ఉండడంతో ఆ టైటిల్ ని పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అంతేగాని ఏ సామజిక వర్గానికి ఈ మూవీతో సంబంధం లేదని పేర్కొన్నాడు. కాగా ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెయిజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల నటుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తుంది.