Rice Production : వరిలో అధిక దిగుబడుల పొందటానికి నిపుణుల సూచనలు !

నాటు పెట్టిన వారం రోజుల వరకు పలుచగా నీరుపెట్టిన మొక్కలు త్వరగా నాటుకుంటాయి. వారం తరువాత నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో 3 సెం.మీ. (ఒక అంగుళం) నీరు ఉండేటట్లు చూసుకుంటే పిలకలు ఎక్కువగా వస్తాయి.

Rice Production : వరిలో అధిక దిగుబడుల పొందటానికి నిపుణుల సూచనలు !

Rice Yield

Rice Production : తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధానమైన ఆహారపంట. వరిసాగు వలన మనకు అన్నం, వంటనూనె, పశు వులకు గడ్డి తవుడు, గుడిసెకు గడ్డి లభిస్తున్నాయి. అంతేకాకుండా బియ్యం మీద నాగరికత, సంసృతి, సంప్రదాయం, పూజా పునస్మారాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడిఉన్నది. నానాటికీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించాలంటే వరిలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నఉత్పాదకతను బాగా పెంచవలసిన అవసరం ఉంది. రైతులకు వరి పంట పండించడం కొత్తకాకపోయినా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను మరియు సూచనలు పాటించినట్లయితే వరిలో 20-25 శాతం అధిక దిగుబడులు పొందవచ్చు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

రైతులకు నిపుణుల సూచనలు ;

వరి నాటేటపుడు నాలుగు నుండి ఆరు ఆకులు కలిగిన నారును సుమారు 80 రోజుల వయస్సున్న నారును నాటాలి. నాటేటపుడు తలలు తుంచి నాటాలి. ఇలా చేయడం వలన ఆకు చివర్లలో ఉన్న కీటకాల గుడ్లు నాశనం చేయబడి నాటు వేసిన తరువాత చీడల బెడద తగ్గుతుంది. దీర్ఘకాలిక రకాలైతే ఒక చదరపు మీటరుకు 38 కుదుళ్ళు ఉండే విధంగా, మధ్యకాలిక రకాలైతే చదరపు మీటరుకు 44 కుదుళ్ళు ఉండే విధంగా, స్వల్పకాలిక రకాలైతే చదరపు మీటరుకు 50 కుదుళ్ళు ఉండేలా నాటాలి.

ప్రతి రెండు మీటర్లకు (6 అడుగులకు) 20 సెం.మీ. తూర్పు, పడమరలుగా దారులు , బాటలు విడిచి కట్టినట్లయితే పైరుకు గాలి వెలుతురు బాగా ప్రసరించి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ బాటలు పైరును పరీక్షించేందుకు ఎరువులు, పురుగు మందులు వాడటానికి సహాయపడతాయి. నాటేటప్పుడు పాలంలో నీరు పలుచగా ఉండాలి.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

నాటు పెట్టిన వారం రోజుల వరకు పలుచగా నీరుపెట్టిన మొక్కలు త్వరగా నాటుకుంటాయి. వారం తరువాత నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో 3 సెం.మీ. (ఒక అంగుళం) నీరు ఉండేటట్లు చూసుకుంటే పిలకలు ఎక్కువగా వస్తాయి. చిరు పొట్ట దశనుండి కంకిలో గింజ గట్టిపడే వరకు 5 సెం.మీ. లేదా 2 అంగుళాల మందం నీరు ఉండేటట్లు చూడాలి. ఎరువులు వేసే ముందు నీరు పలుచగా ఉంచాలి.

గుళికలు వాడేటపుడు 2 అంగుళాల నీరు ఉండాలి. గుళికలను ఎట్టి పరిస్థితిలో కూడా ఎరువులతో కలిపి చల్లరాదు. ఇసుకలో కలిపి చల్లాలి. జింక్‌ లోప లక్షణాలు ఉన్నట్లయితే మొక్కలు గిడసబారి పిలకలు ఎక్కువగా వస్తాయి. ముదురు ఆకులలో చివర తుప్పు రంగు మచ్చలు కనబడతాయి. దీని నివారణకు జింక్‌ సల్ఫేట్‌ 2 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పంచపై 2 సార్లు 3 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. లేదా ప్రతి రెండు పంటలకు ఒకసారి 20 కేజీల జింక్‌ సల్ఫేట్‌ దుక్కిలో వేయాలి. భాస్వరం మోతాదు మించి వాడినట్లయితే జింకు లోపం అధికంగా కనిపిస్తుంది.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ఒక ఎకరాకు కావల్సిన మూడవ వంతు నత్రజని, పూర్తి భాస్వరం మరియు సగం పొటాష్‌ను దుక్కిలోనే వేయాలి. నత్రజనిని మూడు భాగాలుగా చేసుకోవాలి. 1/3 వంతు దుక్కిలో మిగతా 1/3 వంతు పలిలక దశలో చివరి మూడవ వంతు నత్రజనిని మరియు సగం పొటాష్‌ చిరు పొట్ట దశలో వాడాలి.