నోట్ల కట్టలు : కృతిమకాలులో రూ. 96వేలు

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 02:38 AM IST
నోట్ల కట్టలు : కృతిమకాలులో రూ. 96వేలు

హైదరాబాద్ : బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మృతదేహం…చేరుకున్న పోలీసులు…మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు…వెంటనే షాక్…అతనికున్న కాలును పరిక్షీస్తే నోట్ల కట్టలు…ఇతను ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
వివరాల్లొకి వెళితే…బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వే స్వేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని హై గ్రౌండ్ పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు పూనుకున్నారు. ఓ కాలు (కృతిమ కాలు) బరువుగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అందులో చెక్ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్లను లెక్కించగా రూ. 96, 780 ఉన్నాయి. అసలు ఇతను ఎవరు ? ఇతనికి డబ్బు ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీశారు. మృతి చెందింది..షరీఫ్ అని..హైదరాబాద్ వాసి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతని కుటుంబసభ్యుల కోసం అన్వేషిస్తున్నారు. 
హైదరాబాద్ వాసి…
షరీఫ్ దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుండి బెంగళూరుకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఓ చిన్న గుడిసె వేసుకుని భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ వ్యాధి సోకడంతో అతని కుడికాలు తొలగించి కృతిమకాలును ఏర్పాటు చేశారు. బిచ్చమెత్తుకున్న డబ్బులో కొంత ఖర్చు చేసిన తరువాత మిగిలిన సొమ్మును కాలులో దాచుకొనే వాడు. 
బౌరే ఆసుపత్రిలో మృతదేహం…
అయితే…జనవరి 03వ తేదీన టాయిలెట్‌కి వెళ్లి కుప్పకూలిపోయాడు. ఇతడిని పరిశీలించిన పోలీసులు చనిపోయాడని నిర్ధారించి..ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడి కృతిమ కాలును పరిశీలించగా డబ్బు బయటపడింది. లెక్కించగా రూ. 500 నోట్లు 42, రూ. 100 నోట్లు 470, రూ. 200 నోట్లు 20, రూ. 50 నోట్లు 251, రూ. 20 నోట్లు 430, రూ. 10 నోట్లు 528 ఉన్నాయి. ఇతని మృతదేహాన్ని బౌరే ఆసుపత్రిలో భద్రపరిచారు. 
షరీఫ్ కుటుంబీకుల సమాచారం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వారి సమాచారం తేలియకపోతే మృతదేహాన్ని తమకు అప్పగించాలని..నగదును ప్రభుత్వానికి అప్పగించాలని స్థానిక మైనార్టీలు పోలీసులను కోరారు.