Uttarkashi Tunnel Rescue: 25 రోజులకు సరిపడా ఆహారం ఉంది.. సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడి అనుభవం

మా శిక్షణ ప్రకారం, మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరిచాము. నీరు పడటం ప్రారంభించగానే బయట ఉన్న వ్యక్తులు మేము లోపల చిక్కుకున్నామని అర్థం చేసుకుని మాకు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారు

Uttarkashi Tunnel Rescue: 25 రోజులకు సరిపడా ఆహారం ఉంది.. సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడి అనుభవం

ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల అనంతరం అంటే మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటికి తీశారు. సొరంగం నుంచి కార్మికులు బయటికి రాగానే పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో పూల మాలలతో స్వాగతం పలికారు. ప్రత్యేకంగా చక్రాలతో అమర్చిన స్ట్రెచర్‌లపై 57 మీటర్ల స్టీల్ పైపుల ద్వారా వారిని బయటికి లాగి రక్షించారు. బయటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకుని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు.

అయితే లోపల వారెలా ఉన్నారు? వారికి ఆహారం ఎలా అందింది? అసలు లోపలి వాతావరణం ఏంటని సొరంగంలో చిక్కుకున్న అఖిలేష్ సింగ్ అనే కార్మికుడు మీడియాకు వెల్లడించాడు. ఈ కష్టాన్ని వివరిస్తూ, తాము ఇంటికి వెళ్లే సమయంలో సొరంగం అకస్మాత్తుగా కూలిపోయిందని చెప్పాడు. “నా ముందు సొరంగం కూలిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత నా చెవులు మొద్దుబారిపోయాయి” అని అఖిలేష్ సింగ్ చెప్పాడు.

ఇది కూడా చదవండి: 70 లక్షల భారతీయ యూజర్ల మొబైల్ నెంబర్లు బ్లాక్.. మీ నెంబర్ సేఫ్‌గా ఉండాలంటే ఈ తప్పు అసలు చేయొద్దు!

“మాకు 18 గంటల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేదు. మా శిక్షణ ప్రకారం, మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరిచాము. నీరు పడటం ప్రారంభించగానే బయట ఉన్న వ్యక్తులు మేము లోపల చిక్కుకున్నామని అర్థం చేసుకుని మాకు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారు” అని తెలిపాడు. అనంతరం శిథిలాల గుండా స్టీల్ పైపును చొప్పించి వారికి రోజు మొత్తం ఆహారం పంపినట్లు చెప్పాడు. తమకు ఆహారం బాగానే అందిందని, ఎంతలా అంటే 25 రోజులకు సరిపడా ఆహారం ఇంకా ఉందని అఖిలేష్ అన్నాడు.

తాను ఇప్పుడు ఇంటికి వెళ్లి కనీసం 1-2 నెలలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు అఖిలేష్ చెప్పాడు. “నేను హెల్త్ చెకప్‌లు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఒకటి రెండు నెలలు విరామం తీసుకున్న తర్వాత ఏమి చేయాలనేది నిర్ణయం తీసుకుంటాను’’ అని అన్నాడు. ఉత్తరకాశీ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా సొరంగం కేంద్ర ప్రభుత్వ చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా ఉంది. ఇది దుర్బలమైన హిమాలయ భూభాగంలో దాదాపు 889 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. నవంబర్ 12న టన్నెల్‌లోని ఒక భాగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో శిథిలాలు కూలిపోవడంతో లోపల పనిచేస్తున్న కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.

ఇది కూడా చదవండి: వ్యవసాయంలో సాంకేతిక విప్లవం.. మహిళా బృందాలకు డ్రోన్లు ఇవ్వనున్న కేంద్రం