ICC Player of the Month : ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. రేసులో ఒకే ఒక్క భార‌తీయుడు

ICC Player of the Month November : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) న‌వంబ‌ర్ నెల‌కు గానూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల కోసం పురుషుల‌, మ‌హిళ‌ల విభాగం నుంచి పోటీదారులను షార్ట్‌లిస్ట్ చేసింది.

ICC Player of the Month : ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. రేసులో ఒకే ఒక్క భార‌తీయుడు

ICC Player of the Month

ICC Player of the Month November : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) న‌వంబ‌ర్ నెల‌కు గానూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల కోసం పురుషుల‌, మ‌హిళ‌ల విభాగం నుంచి పోటీదారులను షార్ట్‌లిస్ట్ చేసింది. పురుషుల‌ విభాగంలో ముగ్గురు ఆట‌గాళ్లు మ‌హిళ‌ల విభాగంగా ముగ్గురు ప్లేయ‌ర్లు ఈ అవార్డు కోసం పోటీప‌డుతున్నారు.

పురుషుల విభాగంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో అద‌ర‌గొట్టిన ఇద్ద‌రు ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌తో పాటు టీమ్ఇండియా పేస‌ర్ కు చోటు ద‌క్కింది.

మహ్మద్‌ షమీ..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మొద‌టి నాలుగు మ్యాచుల్లో ఆడ‌క‌పోయినప్ప‌టికీ మెగాటోర్నీలో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు మ‌హ్మ‌ద్ ష‌మీ. 7 మ్యాచుల్లో 24 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ ఫైన‌ల్ చేర‌డంతో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు ఐసీసీ నామినేట్‌ చేసింది.

ట్రావిస్‌ హెడ్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచులో అద్భుతంగా ఆడి ఆరోసారి ఆస్ట్రేలియా ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ నామినేట్ అయ్యాడు. ఈ టోర్నీలో 5 మ్యాచులు మాత్ర‌మే ఆడిన హెడ్ 44 సగటుతో 220 పరుగులు చేశాడు.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచులో విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ చేశాడు. ఓడిపోవాల్సిన మ్యాచుల్లో ఒంటి చేత్తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. అంతేకాకుండా భార‌త్‌తో టీ20 సిరీస్‌లో సైతం సెంచ‌రీతో రాణించాడు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 లోగో విడుద‌ల‌.. ప్ర‌త్యేక‌త ఏంటంటే..?

మ‌హిళ‌ల విభాగంలో..
మ‌హిళ‌ల విభాగంలో ఇద్ద‌రు బంగ్లాదేశ్ నుంచి మ‌రొక‌రు పాకిస్తాన్ నుంచి పోటీప‌డుతున్నారు. బంగ్లాకు చెందిన న‌హిదా అక్త‌ర్, ఫ‌ర్గానా హ‌క్, పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ సాదియా ఇక్బాల్ లు ఉన్నారు.

న‌హిదా అక్త‌ర్‌..
పాకిస్తాన్‌తో జ‌రిగిన సిరీస్‌తో బంగ్లాదేశ్ స్పిన్న‌ర్‌ న‌హిదా అక్త‌ర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో న‌హిదా 7 వికెట్లు ప‌డ‌గొట్టింది. దీంతో బంగ్లా 2-1తో సిరీస్ సొంతం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించింది.

ఫర్గానా హ‌క్..
పాకిస్తాన్‌తో సిరీస్‌లో ఫర్గానా హ‌క్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. 36.62 స‌గటుతో 110 ప‌రుగులు చేసింది.

సాదియా ఇక్బాల్..
పాక్ స్పిన్న‌ర్ స‌దియా బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో చెల‌రేగింది. 2.58 ఎకాన‌మీతో 6 వికెట్లు తీసింది.

Virat Kohli : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..? ప్ర‌త్యామ్నాయ ఆట‌గాడు అత‌డేనా..?

ప్ర‌తీ నెల‌లో మొద‌టి రోజు నుంచి చివ‌రి రోజు వ‌ర‌కు ఉన్న ప్ర‌ద‌ర్శ‌న‌ల ఆధారంగా ఆయా కేట‌గిరీలో అత్యుత్తుమ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ముగ్గురిని షార్ట్ లిస్త్ చేస్తారు. ఆ త‌రువాత ఓటింగ్ నిర్వ‌హిస్తారు. ఈ ఓటింగ్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్‌లో పాల్గొంటారు.