Viral Video : బాడీ షేమర్కు లైవ్‌లో స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చిన యాంకర్
తన వస్త్రధారణపై ఓ వ్యక్తి నుండి అవమానకరమైన ఈ-మెయిల్ అందుకున్న యాంకర్ లైవ్ టీవీలో అతనికి రిప్లై ఇచ్చింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
![Viral Video : బాడీ షేమర్కు లైవ్‌లో స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చిన యాంకర్ Viral Video : బాడీ షేమర్కు లైవ్‌లో స్ట్రాంగ్‌గా సమాధానం ఇచ్చిన యాంకర్](https://10tv.in/wp-content/uploads/2023/12/New-Project-25.jpg)
Viral Video
Viral Video : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుండి సామాన్యులకు సైతం బాడీ షేమింగ్, ట్రోలింగ్ పెద్ద సమస్యగా మారింది. యాంకర్ వస్త్రధారణను విమర్శిస్తూ ఓ వ్యక్తి పంపిన ఈమెయిల్‌కు లైవ్ టీవీలో ఆమె చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో అధిక బరువు ఉన్నవారిని బాడీ షేమర్లు అవమానించడం గమనిస్తూనే ఉన్నాం. ఇతరులు ఆత్మవిశ్వాసం కోల్పోయేలా బాడీ షేమర్లు ప్రవర్తిస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇదొక సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఈ పోకడ మరీ ఎక్కువైంది. తాజాగా కెనడియన్ రిపోర్టర్ లెస్లీ హోర్టన్ (59) బాడీ షేమర్ నుంచి ఇబ్బంది ఎదుర్కున్నారు. ఆమె వస్త్రధారణను విమర్శిస్తూ అవమానకరంగా ఈ-మెయిల్ పంపిన వ్యక్తికి ఆమె లైవ్‌లో సమాధానం చెప్పారు. గ్లోబల్ కాల్గరీ, కెనడియన్ న్యూస్ అవుట్లెట్, హోర్టన్ వర్క్స్ కంపెనీ ట్విట్టర్లో ఆ వీడియోను షేర్ చేసింది. హోర్టన్‌కు ‘మీరు గర్భం ధరించినందుకు ధన్యవాదాలు.. అందుకేనా పాత బస్ డ్రైవర్ పాంట్ వేసుకున్నారు’ అంటూ ఓ వ్యక్తి నుండి ఈ-మెయిల్ వచ్చింది. దానికి లైవ్‌లో హోర్టన్ సమాధానం ఇచ్చారు. ‘ధన్యవాదాలు.. నిజానికి నేను ప్రెగ్నెంట్ కాదు.. గతేడాది క్యాన్సర్ కారణంగా నా గర్భాశయాన్ని కోల్పోయాను. ఇక నా వయసులో ఉండే స్త్రీలు ఇలాగే ఉంటారు.. అది మీకు అభ్యంతరకరంగా ఉంటే దురదృష్టకరం’ అని రిప్లై చేశారు.
Viral Video : కదులుతున్న రైలే వేదిక.. ప్రయాణికులే అతిథులు.. జంట పెళ్లి వీడియో వైరల్
హోర్టన్‌కు మెయిల్ పంపిన వ్యక్తి 4 సంవత్సరాలుగా ఇలాగే పంపుతున్నాడట. పర్టిక్యులర్‌గా ఈ ఈ-మెయిల్ తననెంతో బాధించిందని హోర్టన్ కెనడియన్ న్యూస్ అవుట్‌లెట్‌కి చెప్పారు. ఇలా పంపడం సరైన పద్ధతి కాదని చెప్పడం కోసమే తను సమాధానం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ వీడియో వైరల్ అయ్యింది. ‘మీరు క్యాన్సర్ తో పోరాటం చేశారు. ప్రతిచోట మీరు మహిళలకు స్ఫూర్తి. మీరు చేస్తున్న పనిని కొనసాగించండి’ అంటూ నెటిజన్లు హోర్టిన్కు రిప్లై చేశారు.
Global News Calgary traffic reporter @global_leslie responds to an email criticising her choice of clothes. #yyc pic.twitter.com/r9Od0hKbn0
— Global Calgary (@GlobalCalgary) December 5, 2023