Viral Video : నాతో ఎవరూ ఆడుకోరు.. తల్లిదండ్రుల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న4 ఏళ్ల బాలుడి వీడియో వైరల్

ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారి మనసుకి గాయమవుతుంది. పసి వయసులో వారికి తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. తన తల్లిదండ్రుల గురించి ఓ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : నాతో ఎవరూ ఆడుకోరు.. తల్లిదండ్రుల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న4 ఏళ్ల బాలుడి వీడియో వైరల్

Viral Video

Viral Video : సింగిల్ చైల్డ్.. తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజీ.. ఇంట్లో ఉన్నా దగ్గరకి తీసేవాళ్లు లేరు. ఒంటరిగానే ఆటలు, పాటలు.. ఓ చిన్నారి మనోవేదన వింటే మనసు చలించిపోతుంది. చాలామంది తల్లిదండ్రులకు కనువిప్పు కలుగుతుంది.

Viral Post : క్యాన్సర్‌తో పోరాడుతూ కూతురి కాలేజ్ వేడుకకు హాజరైన తండ్రి.. కన్నీరు తెప్పించిన కథనం

ఇటీవల కాలంలో జీవితంలో సెటిల్ అయ్యాక కాస్త లేటు వయసులోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒక బిడ్డ చాలని సరిపెట్టేస్తున్నారు. ఇక వారి ఆలన పాలన చూడటానికి ఇంట్లో పనివారు.. స్కూళ్లలో ఆయాలు ఉంటారు. కనీసం పిల్లలు ఇంట్లో ఉన్న కాస్త సమయంలో కూడా పని పేరు చెప్పి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల ముందు మునిగిపోవడం.. పిల్లలు ఏడుస్తుంటే పనిలో పని వారి చేతిలో కూడా సెల్ ఫోన్ పెట్టడం చూస్తున్నాం. కానీ ఆ పసి మనసులు అసలు ఏం కోరుకుంటున్నాయి? వారు తల్లిదండ్రుల్ని ఎంతగా మిస్ అవుతున్నారు? అని ఆలోచించేవారు తగ్గిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే పసిపిల్లల పట్ల అశ్రద్ధగా ఉండే పేరెంట్స్‌కి కనువిప్పు కలుగుతుంది.

దక్షిణ కొరియాకు చెందిన 4 ఏళ్ల బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Anita Vams అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ‘మై గోల్డెన్ కిడ్స్’ అనే రియాలిటీ షోకి సంబంధించినది. అందులో ఆ చిన్నారి తన తల్లిదండ్రుల గురించి సమాధానాలు ఇచ్చాడు. పిల్లల పెంపకంలో పేరెంట్స్ ఎదుర్కుంటున్న ఇబ్బందులు అనే అంశంపై కొందరు ఎక్స్‌పర్ట్స్ ఈ షోలో మాట్లాడారు. యాంకర్ సాంగ్ ఇయో జున్‌ ఆ బాలుడిని పేరెంట్స్ గురించి అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ‘నాకు తెలియదు.. ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను.. నాతో ఎవరూ ఆడరు’ అని బేలగా సమాధానం ఇచ్చాడు. వీడియోలో బొమ్మలతో ఆ బాలుడు ఒంటరిగా ఆడుకోవడం కనిపించింది. ఈ చిన్నారికి 6 నెలల చెల్లెలు కూడా ఉంది.

Andhra Pradesh : కూతురి పెళ్లికోసం దాచిన రూ.2 లక్షల సొమ్ము కొరికేసిన ఎలుకలు.. కన్నీరు మున్నీరైన కుటుంబం

ఆ చిన్నారిని తండ్రి గురించి అడిగినప్పుడు అతను ఎప్పుడూ కోపంగా ఉంటాడని.. తనతో సౌమ్యంగా మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. తన తల్లికి తనంటే ఇష్టం లేదని అనుకుంటున్నానని చెబుతూ కన్నీరు ఆపుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వీడియో క్లిప్ తన తల్లితో ఎక్కువ సమయం గడపాలనే కోరికను వ్యక్తపరిచే పాటతో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల మనసు చలించిపోయింది. చాలామంది అతనిని హగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు. యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ అయిన ఈ వీడియో సాంగ్ అతనిని పెంచడంలో తల్లిదండ్రులు ఎదుర్కున్న సవాళ్లను చూపించింది. షో చివర్లో ఆ బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం ఇకపై సమయాన్ని వెచ్చిస్తామని హామీ ఇచ్చారట.