Viral Post : క్యాన్సర్‌తో పోరాడుతూ కూతురి కాలేజ్ వేడుకకు హాజరైన తండ్రి.. కన్నీరు తెప్పించిన కథనం

పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ తమ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఓ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా కూతురి కోసం ఏం చేశాడో చదవండి.

Viral Post : క్యాన్సర్‌తో పోరాడుతూ కూతురి కాలేజ్ వేడుకకు హాజరైన తండ్రి.. కన్నీరు తెప్పించిన కథనం

Viral Post

Viral Post : స్టేజ్ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి.. కూతురి సంతోషం కోసం ఆమె చదువుకున్న స్కూల్ ఈవెంట్‌కు ఆమెకు తోడుగా వెళ్లాడు. కూతురితో కలిసి నడిచాడు. కూతురి ఆనందం కోసం ఆ తండ్రి తన అనారోగ్యాన్ని కూడా లక్ష్యపెట్టకపోవడం అందరి మనసుల్ని కదిలించింది.

Zimbabwe : దొంగ పాము.. కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్తున్న పాము వీడియో వైరల్

బ్రెట్ యాన్సీ అనే 47 సంవత్సరాల వ్యక్తి అన్నవాహికకు సంబంధించి 4 వ దశ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అంతటి అనారోగ్యంలో సైతం తన 17 ఏళ్ల కూతురు సారా కేట్‌తో కలిసి ఆమె చదువుకున్న స్కూలు వేడుకల్లో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. హోమ్ కమింగ్ ర్యాలీ పేరుతో కేట్ చదువుకున్న సౌత్‌సైడ్ స్కూలు యాజమాన్యం ఈ వేడుకును నిర్వహించింది. ఈ ర్యాలీకి సారా కేట్‌ను క్వీన్‌గా ఎంపిక చేసారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న కూతురికి తోడుగా వెళ్లి నిలబడ్డాడు బ్రెట్ యాన్సీ.

Woman : ఇంటి సీలింగ్ నుండి రెండు పెద్ద పాములను చేతులతో బయటకు తీసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలను కేట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కిరీటం ధరించి, గర్వంగా పూలగుత్తి పట్టుకుని ఆమె తండ్రితో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘తనకి దక్కిన గౌరవానికి సంతోష పడుతున్నానని.. తనకు ఇలాంటి గౌరవం ఇచ్చిన సౌత్‌సైడ్ హైస్కూల్‌కి ధన్యవాదాలని .. ఈ స్థలం తనను ఈరోజు ఎంతో చక్కగా తీర్చిదిద్దిందని’ కేట్ పోస్ట్‌కి శీర్షిక యాడ్ చేసింది. అయితే పోస్ట్‌లో ఎక్కడా తన తండ్రి క్యాన్సర్ గురించి ప్రస్తావించలేదు. కేట్ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని ఆశీర్వదించారు.

 

View this post on Instagram

 

A post shared by Sarakate:) (@sarakateyancey)