Andhra Pradesh : కూతురి పెళ్లికోసం దాచిన రూ.2 లక్షల సొమ్ము కొరికేసిన ఎలుకలు.. కన్నీరు మున్నీరైన కుటుంబం

కూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టిన కష్టార్జితం ఎలుకల పాలైంది. రూ.2 లక్షల కరెన్సీ నోట్లు ఎలుకలు కొరికేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది.

Andhra Pradesh : కూతురి పెళ్లికోసం దాచిన రూ.2 లక్షల సొమ్ము కొరికేసిన ఎలుకలు.. కన్నీరు మున్నీరైన కుటుంబం

Andhra Pradesh

Updated On : November 18, 2023 / 4:42 PM IST

Andhra Pradesh : కూతురి పెళ్లి కోసం రూ.2 లక్షలు సొమ్ము ట్రంకు పెట్టెలో దాచి పెట్టాడు ఆమె తండ్రి. కూతురి పెళ్లి చేయకుండానే కన్నుమూశాడు. అతను చనిపోయాక పెట్టె తెరిచి చూసిన అతని తల్లిదండ్రులు షాకయ్యారు. ఎలుకలు కరెన్సీ నోట్లను మొత్తం కొరికి పారేశాయి. కష్టపడి కొడుకు దాచిన సొమ్ము ఎలుకల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. వారం వ్యవధిలో మూడు చోట్ల దొంగతనాలకు విఫలయత్నం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పుత్తూరులో ఎలుకలు కరెన్సీ నోట్లు కొరికేసిన ఘటన చోటు చేసుకుంది. గోపాల్రావు అనే వ్యక్తి కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టాడు. అలా రూ.2 లక్షల సొమ్మును ట్రంకు పెట్టెలో దాచిపెట్టాడు. గోపాల్రావు మూడు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఇటీవల అతని కుటుంబ సభ్యులు ట్రంకు పెట్టెను తెరిచి చూసారు. ఒక్కసారిగా షాకయ్యారు. గోపాల్రావు దాచిపెట్టిన సొమ్మంతా ఎలుకలు కొరికేసాయి.

Cyclone Mythili : తీరందాటిన మిథిలి.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

గోపాల్రావు కష్టార్జితం కాస్త ఎలుకలు కొరికేయడం చూసి అతని తల్లిదండ్రులు లక్ష్మణరావు, గుంపమ్మ, తమ్ముడు చిన్నారావు కన్నీరు మున్నీరయ్యారు. అతని కుటుంబం కోసం కష్టపడిన సొమ్ము ఎందుకు పనికిరాకుండా పోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని వేడుకుంటున్నారు.