CPI Narayana : జగన్ ఎంతమందిని మార్చినా ఓటమి ఖాయం : సీపీఐ నారాయణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతాయిని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారింది..ఏపీలో కూడా ప్రభుత్వం మారుతుందన్నారు.

CPI Narayana : జగన్ ఎంతమందిని మార్చినా ఓటమి ఖాయం : సీపీఐ నారాయణ

cpi narayana

CPI Narayana..AP Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా పునరావృతం అవుతాయని సీపీఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారింది..ఏపీలో కూడా ప్రభుత్వం మారుతుందన్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. అభ్యర్ధుల్ని మార్చక కేసీఆర్ సీఎం పదవి కోల్పోయారని.. ఏపీలో జగన్ ఇన్‌చార్జ్‌లను, ఎమ్మెల్యే అభ్యర్ధుల్ని మార్చినా  ఓటమి తప్పదన్నారు. తెలంగాణలో కేసీఆర్ అభ్యర్ధుల్ని మార్చక ఓడిపోతే..ఏపీలో జగన్ అభ్యర్ధుల్ని మార్చినా ఓడిపోతారు అంటూ ఎద్దేవా చేశారు.

ఆరు కిలోమీటర్లు తిరగటానికి కూడా హెలికాప్టర్ ఉపయోగిస్తారు ఏపీ సీఎం… గాల్లో తిరిగేవారు గాల్లోనే పోతారు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనను చూసి ఓటు వేయమని కోరారని.. ప్రజలు కూడా అదే చేశారని కాకపోతే కేసీఆర్‌ను చూసి ఓటు వేసేది లేదని తేల్చి చెప్పి ఓడించారని అన్నారు. ఏపీలో జగన్ పాతవాళ్లను మార్చి కొత్త వాళ్లను నియమించి గెలుద్దామని ప్లాన్లు వేస్తున్నారు. కానీ ఎంతమందిని మార్చినా ఓటమి ఖాయమన్నారు. ఏపీలో ప్రభుత్వం మారటం ఖాయమన్నారు. ఎంతమందిని మార్చినా ఫలితం లేదన్నారు. జగన్ చేసే మార్పులు ఎలా ఉన్నాయంటే.. కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. జగన్ బంగారపు బొమ్మను నిలబెట్టినా ఓడిస్తారని అన్నారు.

AP Politics : అభ్యర్ధుల్ని కాదు కదా.. పార్టీ అధ్యక్షుడిని మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యం : టీడీపీ నేతల సెటైర్లు

సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మరోసారి ఎన్నికల బరిలోకి వెళితే ఓటమి ఖాయమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు.  దీని కోసం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను మారుస్తున్నారు.ఇప్పటికే 11మంది ఇంఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ.. మొత్తం 62 చోట్ల ఇంఛార్జ్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇక, 30మందికిపైగా సిట్టింగ్‌లకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా జగన్ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చేలా..ఓడిపోతారు అనే కాస్త అనుమానం ఉన్నా..వారిని ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నారు. జగన్ తీసుకునే నిర్ణయాలతో పలువురు నేతలు ఉలిక్కిపడతున్నారు. ఈ సారి సీటు దక్కుతుందా..? లేదా అనే ఆందోళన చెందుతున్నారు. కానీ ఎవరు ఏమనుకున్నాను తాను అనుకున్నదే చేస్తున్నారు.

కానీ జగన్ ఎన్ని యత్నాలు చేసినా..అభ్యర్ధుల్ని మార్చినా..ఇన్ చార్జ్‌లను మార్చినా ఓటమి తప్పదంటున్నారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణలో మారినట్లే ..ఏపీలోను ప్రభుత్వం మారుతుందంటున్నారు.