సీఎం అవ్వాలి అనుకుంటే పెద్ద కష్టమేమి కాదు.. కానీ.. మెగా ఫ్యామిలీపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..

ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవచ్చు కదా, రాజకీయాల్లో ఒంటరి అయ్యారు అంటూ పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో శివాజీ మాట్లాడుతూ..

సీఎం అవ్వాలి అనుకుంటే పెద్ద కష్టమేమి కాదు.. కానీ.. మెగా ఫ్యామిలీపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss Fame Actor Sivaji Reaction on Mega Family and Politics

Sivaji : నటుడు శివాజీ ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి కెరీర్ చూసి ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యారు. ఇక రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంద్ర కోసం శివాజీ పోరాడుతూ కొన్నాళ్ళు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. త్వరలో ఓ కొత్త వెబ్ సిరీస్ తో రాబోతున్నారు శివాజీ.

శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో ‘#90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే టైటిల్ తో రాబోతున్నారు. ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా సిరీస్ యూనిట్ అంతా విచ్చేసారు. శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మొదటిసారి ఈ ఈవెంట్ లోనే పాల్గొన్నాడు.

ఈ ఈవెంట్లో సిరీస్ తో పాటు పలు అంశాల గురించి మాట్లాడాడు. ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవచ్చు కదా, రాజకీయాల్లో ఒంటరి అయ్యారు అంటూ పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో శివాజీ మాట్లాడుతూ.. ఇక్కడ పాలిటిక్స్ ప్రశ్నలు వద్దు. కానీ అడిగారు కాబట్టి ఇదొక్కటే. అందరికి దీంతోనే సమాధానమిస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవ్వరికి లేదు.

Also Read : మహేష్ ‘కుర్చీ మడతపెట్టి..’ సాంగ్‌పై.. కుర్చీ తాత ఏమన్నాడంటే?

వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమి కాదు. ఎక్కడో చిన్నలోపం ఉంది. దాన్ని సరిచేసుకుంటే చాలు. పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. ప్రత్యేకహోదా యూత్ కోసం అడిగాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది. ఎన్నాళ్లని ఒక్కడినే పొరాడగలను. తర్వాత పాలిటిక్స్ గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు ప్రశ్నలు అడగండి. ఇప్పుడు వద్దు అని అన్నారు. దీంతో శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.