Balakrishna – Mahesh Babu : బాలయ్య – మహేష్ బాబు మల్టీస్టారర్.. లీక్ చేసిన తమన్.. కథ కూడా రెడీ..

బాలకృష్ణ - సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారని వినిపిస్తుంది.

Balakrishna – Mahesh Babu : బాలయ్య – మహేష్ బాబు మల్టీస్టారర్.. లీక్ చేసిన తమన్.. కథ కూడా రెడీ..

Balakrishna and Mahesh Babu Multi starer on Cards Thaman gives Hint

Updated On : September 9, 2024 / 7:34 AM IST

Balakrishna – Mahesh Babu : ఇప్పుడు మల్టీస్టారర్ల హవా నడుస్తుంది. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి సమయంలో పలు మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. RRR సినిమాతో స్టార్ హీరోల మల్టీస్టారర్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా కొత్త మల్టీస్టారర్ కాంబో వినిపిస్తుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ – సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో సింగర్ శ్రీరామచంద్ర మహేష్ బాబు, బాలకృష్ణ ఇద్దరి సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఏ సినిమా చేస్తారు అని తమన్ ని అడగ్గా తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ, మహేష్ బాబు గారు కలిసి చేసే సినిమాకు చేస్తాను. బాలకృష్ణ – మహేష్ బాబు గారి మల్టీస్టారర్ సినిమా రావొచ్చు. ఆల్రెడీ నేను కథ కూడా విన్నాను అని చెప్పారు.

Also Read : Prabhas – RajaSaab : పాపం పండగ హాలిడే కూడా లేకుండా షూట్ చేస్తున్న ప్రభాస్.. ‘రాజాసాబ్’ని పరిగెత్తిస్తున్నారుగా..

దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలయ్య, మహేష్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలని షేర్ చేస్తూ ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు. మరి బాలయ్య – మహేష్ బాబు మల్టీస్టారర్ కథ ఎవరు రాసుకున్నారో? అది వాళ్లకు వినిపించారా? ఆ సినిమా వర్కౌట్ అవుతుందా చూడాలి. నిజంగా వర్కౌట్ అయితే మరో భారీ బాక్సాఫీస్ సినిమా ఖాయం. ఒకవేళ రావాలన్నా అది ఇప్పట్లో కష్టమే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. అది అవ్వాలంటే కనీసం మూడు నాలుగేళ్లు సమయం పడుతుంది. అది అయ్యాకే ఉండొచ్చేమో.