Mahindra Thar Earth : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Mahindra Thar Earth : మహీంద్రా నుంచి సరికొత్త ఎస్‌యూవీ మోడల్ థార్ ఎర్త్ ఎడిషన్ లాంచ్ అయింది. ఈ మోడల్ ఎడిషన్ రూ.15.40 లక్షల ప్రారంభ ధరలో మార్కెట్లోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Mahindra Thar Earth : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Mahindra Thar Earth edition launched, price starts at Rs 15.40 lakh

Mahindra Thar Earth : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లోకి స్వదేశీ ఎస్‌యూవీ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్‌ వచ్చేసింది. ఈ థార్ మోడల్ ఎడిషన్‌ను రూ. 15.40 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద కంపెనీ లాంచ్ చేసింది. టాప్-స్పెక్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ 4×4 వేరియంట్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : MobiKwik Pocket UPI : గుడ్ న్యూస్.. ఇక బ్యాంకు అకౌంటుతో పనిలేదు.. ‘పాకెట్ యూపీఐ’తో ఈజీ పేమెంట్స్..!

థార్ ఎర్త్ ఎడిషన్‌లో 2.0-లీటర్ (mStallion) 150 టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ (150bhp/320Nm), 2.2-లీటర్ (mHawk) 130 సీఆర్డీఇ డీజిల్ ఇంజన్ (130bhp/300Nm) ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఉన్నాయి. థార్ ఎర్త్ ఎడిషన్‌లో 4డబ్ల్యూడీ ప్రామాణికంగా ఉన్నప్పటికీ.. ఆర్‌డబ్ల్యూడీకిఆప్షన్ అందించడం లేదు. వేరియంట్ వారీగా మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ క్రింద విధంగా ఉన్నాయి.

వేరియంట్                            ధర
పెట్రోల్ ఎంటీ                రూ.15.40 లక్షలు
పెట్రోల్ ఏటీ                  రూ. 16.99 లక్షలు
డీజిల్ ఎంటీ                రూ.16.15 లక్షలు
డీజిల్ ఏటీ                  రూ.17.60 లక్షలు

Mahindra Thar Earth edition launched, price starts at Rs 15.40 lakh

Mahindra Thar Earth edition 

ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు :
థార్ ఎర్త్ ఎడిషన్ శాటిన్ మ్యాట్ ‘డెసర్ట్ ఫ్యూరీ’ ఎండ్‌తో అందిస్తోంది. సిల్వర్, మాట్ బ్లాక్ బ్యాడ్జ్‌లతో డోర్లు, బ్యాక్ ఫెండర్‌పై డూన్-ప్రేరేపిత డీకాల్స్ ఉన్నాయి. దీనిపై ‘ఎర్త్ ఎడిషన్’ బ్యాడ్జ్‌ని చూడవచ్చు. థార్ ఎర్త్ ఎడిషన్ లోపలి భాగం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బ్లాక్ కలర్ బేస్, లైట్ బ్రౌన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. లేత గోధుమరంగు లెథెరెట్ సీట్లు, హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్‌లను కలిగి ఉంటాయి.

ఏసీ వెంట్స్‌పై ‘డెసర్ట్ ఫ్యూరీ’ ఇన్‌సర్ట్‌లు, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ యాక్సెంట్, డోర్‌లపై థార్ బ్రాండింగ్‌తో క్యాబిన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. థార్ ఎర్త్ ఎడిషన్ ఎస్‌యూవీలలో ప్రతి ఒక్క సీరియల్ నంబర్ ఒకటితో ప్రారంభమయ్యే ప్రత్యేకమైన సంఖ్యలతో (VIN) ప్లేట్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Read Also : Reliance Disney Merger : రిలయన్స్-డిస్నీ మీడియా బిగ్ డీల్.. చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ.. ఒకేచోటకు మొత్తం 120 టీవీ ఛానళ్లు!