Gold Price Today : తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

వారం రోజుల క్రితం వరకు బంగారం కొనుగోలు చేయాలంటేనే మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. కేంద్రం బడ్జెట్ ఎఫెక్ట్ తో నింగికి చేరిన బంగారం, వెండి ధరలు నెమ్మదిగా నేలకు దిగొస్తున్నాయి.

Gold Price Today : తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

Gold And Silver Price Today

Gold and Silver Price Today : వారం రోజుల క్రితం వరకు బంగారం కొనుగోలు చేయాలంటేనే మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. కేంద్రం బడ్జెట్ ఎఫెక్ట్ తో నింగికి చేరిన బంగారం, వెండి ధరలు నెమ్మదిగా నేలకు దిగొస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ నెలాఖరు వరకు బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల చోటుచేసుకోవటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ. 50 నుంచి రూ. 55వేలకు చేరే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. తాజాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,820
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,150 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,950.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,820.
    చెన్నైలో బంగారం ధర తగ్గింది. 10గ్రాముల గోల్డ్ పై రూ. 170 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,980 కు చేరింది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 89,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,500.
    బెంగళూరులో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,250 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.