Paytm Fastag Today : ఈరోజే లాస్ట్.. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ ఎందుకు డియాక్టివేట్ చేయాలి? రిఫండ్ ఎలా పొందాలంటే?

Paytm Fastag Today : పెనాల్టీలు, టోల్ ధరల పెంపును నివారించడానికి మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని NHAI పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు సూచించింది.

Paytm Fastag Today : ఈరోజే లాస్ట్.. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ ఎందుకు డియాక్టివేట్ చేయాలి? రిఫండ్ ఎలా పొందాలంటే?

Last day for Paytm Fastag today _ How and why it is important to deactivate your Paytm Fastag and get refund

Paytm Fastag Today : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం కొత్త అడ్వైజరీని జారీ చేసింది. ఈ వారం ప్రారంభంలో జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ చెల్లింపులు, పెనాల్టీలు, రెట్టింపు టోల్ ధరలను నివారించడానికి మార్చి 15 లోపు ఇతర బ్యాంకులకు మారాలని పేటీఎం జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఎన్‌పీసీఐ కోరింది.

జనవరి 31న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పీపీబీఎల్‌పై నిషేధంలో భాగంగా కస్టమర్ల అకౌంట్లు, ఫాస్ట్ ట్యాగ్ ఇతర సర్వీసుల్లో కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని సెంట్రల్ బ్యాంక్ పీపీబీఎల్‌కి తెలిపింది.

Read Also : Paytm FAQs : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మార్చి 15 తర్వాత ఏ సర్వీసు పనిచేస్తుంది? ఏది పనిచేయదంటే? అన్ని ప్రశ్నలకు సమాధానాలివే!

ఆ తరువాత ఎన్‌హెచ్ఏఐ కూడా ఫాస్ట్ ట్యాగ్‌ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించింది. మీ పేటీఎం ఫాస్ట్ ట్యాగ్‌ని ఎందుకు డియాక్టివేట్ చేయాలంటే.. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ ఇంటర్ ఆపరేబుల్ కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీని అర్థం.. వినియోగదారులు ఆయా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను మరో అకౌంటుకు బదిలీ చేయాలి.

అలాగే, అన్ని ఫ్యాస్ట్ ట్యాగ్స్ ట్రాన్స్‌ఫర్ కుదరదని గమనించాలి. ఎన్‌హెచ్ఏఐ ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్’ పాలసీలో భాగంగా వాహనంలో యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు తమ వాహనం కోసం మరో దానిని పొందే ముందు పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ డియాక్టివేట్ చేయాలి. పేటీమ్ జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్‌ని ఎలా డియాక్టివేట్ చేయాలి? వాపసు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేషన్‌ను ఎలా రిక్వెస్ట్ పెట్టాలి? :

  • పేటీఎం ఫాస్టాగ్‌ని డియాక్టివేట్ చేయడానికి 1800-120-4210కి డయల్ చేయండి.
  • వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) లేదా ట్యాగ్ ఐడీతో పాటు ట్యాగ్ రిజిస్టర్ చేసిన మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • డియాక్టివేషన్ రిక్వెస్ట్ పెంచడానికి మొత్తం ప్రాసెస్ పూర్తి చేయండి.

ప్రత్యామ్నాయంగా, మీరు పేటీఎం హెల్ప్ అండ్ సపోర్టు, ఆపై ఫాస్ట్ ట్యాగ్ తర్వాత Need Help ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత, డియాక్టివేషన్ రిక్వెస్ట్ చేయండి.

వాపసు ఎలా పొందాలి? :
డియాక్టివేషన్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ లింక్ చేసిన వ్యాలెట్లలో ఆటోమాటిక్‌గా వాపసును స్వీకరిస్తారు. ఇందులో మిగిలిన బ్యాలెన్స్ అలాగే రూ. 150 సెక్యూరిటీ డిపాజిట్ రెండూ ఉంటాయి. వాపసు రిక్వెస్ట్ ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు.

వాపసు స్టేటస్ ఎలా చెక్ చేయాలి :

  • ముందుగా మీ పేటీఎం అకౌంట్లోకి వెళ్లండి
  • Helf & Support ఆప్షన్ నొక్కండి
  • Fastag ఆప్షన్ తర్వాత Need Help ఎంచుకోండి.
  • ఫాస్ట్ ట్యాగ్‌ డియాక్టివేట్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఫాస్ట్ ట్యాగ్ డియాక్టివేషన్ రీఫండ్ స్టేటస్ సంబంధించి ఆటోమాటిక్ రెస్పాన్స్ అందుకుంటారు

Read Also : WhatsApp Profile Pictures : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇతర వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలను స్ర్కీన్‌షాట్ తీయడం కుదరదు!