Pushpa 2 – Kalki 2898 AD : పుష్ప 2 వాయిదా.. కల్కి ఆగష్టులో.. ఎన్నికల షెడ్యూల్‌తో రిలీజ్‌లు మారుతున్నాయా..

పుష్ప 2 వాయిదా పాడబోతోందా..? ఆ డేట్ ని కల్కి కోసం త్యాగం చేయబోతుందా..?

Pushpa 2 – Kalki 2898 AD : పుష్ప 2 వాయిదా.. కల్కి ఆగష్టులో.. ఎన్నికల షెడ్యూల్‌తో రిలీజ్‌లు మారుతున్నాయా..

Allu Arjun Pushpa 2 getting postponed for Prabhas Kalki 2898 AD

Pushpa 2 – Kalki 2898 AD : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో వచ్చే రెండు నెలలు దేశమంతటా పొలిటికల్ హీట్ లో ఉండబోతుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్స్ ని కూడా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇక ఈ షెడ్యూల్‌తో టాలీవుడ్ బడా మూవీల రిలీజ్‌లకు ఇబ్బంది ఎదురైంది. ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ డేట్ కి నాలుగు రోజుల ముందు ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ రిలీజ్ ఉంది.

ఎన్నికల సమయం కావడంతో ప్రజల్లో చాలామంది పార్టీల ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఆడియన్స్ థియేటర్స్ కి రావడం అన్నది పక్కన పెడితే.. కల్కి లాంటి పెద్ద సినిమాకి టికెట్ హైక్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అలాగే పార్లమెంట్ ఎన్నికల వల్ల పాన్ ఇండియా మార్కెట్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇలాంటి టైంలో కల్కి లాంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలు కచ్చితంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also read :Meetha Raghunath : పెళ్లి చేసేసుకున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్.. ఫోటోలు వైరల్..

దీంతో కల్కి సినిమా రిలీజ్ డౌట్ అన్నట్లే తెలుస్తుంది. ఈ మూవీని వాయిదా వేయాల్సి వస్తే.. దగ్గరలో మరో సరైన డేట్ కూడా లేదు. కల్కి తరువాత రిలీజ్ అయ్యేందుకు పుష్ప 2, OG వంటి సినిమాలు డేట్స్ లాక్ చేసుకున్నాయి. దేవర, గేమ్ ఛేంజర్ సినిమాలు కూడా లైనప్ లో సరైన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో ఒకవేళ కల్కి వాయిదా పడితే.. మళ్ళీ ఈ ఏడాది చివరిలోనే రిలీజ్ డేట్ చూసుకోవాల్సి ఉంటుంది.

అలా కాకుండా కల్కి కోసం పుష్ప 2, OG వంటి సినిమాలు వెనక్కి తగ్గి ఛాన్స్ ఇస్తే.. ఆ డేట్ కి కల్కి రావొచ్చు. ఈక్రమంలోనే పుష్ప 2 ఆగష్టు 15 నుంచి వాయిదా పడబోతుందని, ఆ డేట్ ని కల్కి కోసం త్యాగం చేయబోతోందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గానీ, అల్లు ఫ్యాన్స్ కి మాత్రం కంగారు పట్టుకుంది. కాగా పుష్ప 1 డిసెంబర్ నెలలోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకుంది. మరి పార్టు 2ని అలాగే విడుదల చేస్తారేమో చూడాలి.