Whatsapp UPI Payments : యూపీఐ పేమెంట్ స్కాన్ : త్వరలో వాట్సాప్ చాట్స్ నుంచే నేరుగా యూపీఐ పేమెంట్లు!

Whatsapp UPI Payments : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చాలా మంది యూజర్లు గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్‌లపై ఆధారపడుతున్నారు. కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు పెరిగే అవకాశం ఉంది.

Whatsapp UPI Payments : యూపీఐ పేమెంట్ స్కాన్ : త్వరలో వాట్సాప్ చాట్స్ నుంచే నేరుగా యూపీఐ పేమెంట్లు!

UPI Scan To Pay : WhatsApp Will Soon Make It Easy To Make In-App UPI Payments

Whatsapp UPI Payments : వాట్సాప్ వినియోగదారుల కోసం భారత్‌లో యూపీఐ పేమెంట్లను అందిస్తుంది. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యూపీఐ యాప్‌లతో పోటీపడుతుంది. కానీ, మెసేజింగ్ యాప్ దేశంలో ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంలో విఫలమైంది. వాట్సాప్ పేమెంట్ ఫీచర్‌ని ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

అయితే, రాబోయే అప్‌డేట్ ద్వారా మరింత మంది వినియోగదారులు వాట్సాప్ యూపీఐ పేమెంట్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ యూపీఐ పేమెంట్ల కోసం క్యూఆర్ కోడ్ కోసం షార్ట్‌కట్‌ను అందిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో మెసేజింగ్ యాప్‌లోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది.

Read Also : International UPI Payments : విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్లను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

చాట్ బాక్సు నుంచే నేరుగా పేమెంట్లు :
ఈ వారం రాబోయే ఫీచర్ వివరాలను (WeBetaInfo) షేర్ చేసింది. మెసేజింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. చాట్ స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ స్కానర్ ఎక్కడ కనిపిస్తుందో మీరు చూడవచ్చు. ‘చాట్‌ల జాబితా నుంచి నేరుగా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేస్తోంది. తద్వారా వినియోగదారులు ఇకపై మల్టీ స్క్రీన్‌ల ద్వారా నావిగేట్ చేయాల్సిన అవసరం లేదు. యూపీఐ పేమెంట్లు చేయడానికి ఎక్కువ సమయం అవసరం లేదని టిప్‌స్టర్ పేర్కొంది.

యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్ ఏంటి? :
ఆండ్రాయిడ్ బీటాలో వాట్సాప్ యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.24.7.3)లో క్యూఆర్ కోడ్ స్కానర్ షార్ట్‌కట్‌ను అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

మీరు కెమెరా, సెర్చ్ ఐకాన్ కలిగిన అదే ట్యాబ్‌లో ప్రైమరీ చాట్ స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ స్కానర్‌ను చూడవచ్చు. మీరు క్యూఆర్ కోడ్ స్కానర్‌పై క్లిక్ చేసినప్పుడు.. ఇతర యూపీఐ అకౌంట్లకు డబ్బును పంపడానికి మల్టీ లూప్‌ల ద్వారా కాకుండా మెసేజింగ్ యాప్ నుంచి యూపీఐ పేమెంట్లను ఎనేబుల్ చేసేందుకు వాట్సాప్ కోడ్‌ను రీడ్ చేస్తుంది.

నెలవారీగా బిలియన్ల విలువైన లావాదేవీలతో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ల మోడ్‌లలో యూపీఐ సర్వీసు ఒకటి. దేశంలో ఈ పేమెంట్ల కోసం చాలా మంది యూజర్లు గూగుల్ పే, ఫోన్‌పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్‌పై ఆధారపడతారు. అయితే, వాట్సాప్ ఇప్పటికే 400 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. ఈ యూపీఐ షార్ట్‌కట్‌ ద్వారా మరింత మంది వాట్సాప్ యూపీఐ పేమెంట్లను వినియోగించే అవకాశం ఉంది.

Read Also : MobiKwik Pocket UPI : గుడ్ న్యూస్.. ఇక బ్యాంకు అకౌంటుతో పనిలేదు.. ‘పాకెట్ యూపీఐ’తో ఈజీ పేమెంట్స్..!