Tdp : టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ఆయన వాపోయారు.

Tdp : టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

Tdp : కదిరి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. కీలక నేత, కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో మైనార్టీలకు అవమానాలు తప్ప అధికారాలు లేవంటూ ఆయన ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన చంద్రబాబుతో ఇక కలిసి పని చేయలేమని ఆయన అన్నారు. మైనార్టీ ఓటర్లు సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కదిరిలో తనకు టికెట్ ఇవ్వలేదని చాంద్ బాషా వాపోయారు. కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు, బహిరంగ సభకు కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చాంద్ బాషా. నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి రుణపడి ఉంటానని అన్నారు.

”మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. మీరు రండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని చంద్రబాబు చెప్పారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాం, మంత్రి పదవి ఇస్తామని నాతో కూడా చెప్పారు. కదిరి టికెట్ కోసం నేను అడిగాను. మైనార్టీలకే అవకాశం కల్పిస్తామని నాకు మాట ఇచ్చారు. ఆఖరి నిమిషం వరకు అదే మాట చెప్పారు. చంద్రబాబు నాకు మొండిచేయి చూపారు. మైనార్టీలను చంద్రబాబు ఆదరించరు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని నాకు బాధ కలిగింది. అందుకే టీడీపీకి రాజీనామా చేశా” అని అత్తార్ చాంద్ బాషా అన్నారు.

Also Read : అక్కడ వైసీపీ సీనియర్‌ను ఓడించేందుకు చంద్రబాబు సరికొత్త ప్రయోగం..!