Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్ రేపు ఆ టైంకి రిలీజ్ కాబోతుంది.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

పుష్ప 2 టీజర్ ని రేపు ఆ టైంకి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్ రేపు ఆ టైంకి రిలీజ్ కాబోతుంది.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Teaser release time update

Pushpa 2 Teaser : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2. ఈ మూవీ కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది అల్లు అర్జున్ బర్త్ డేకి ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసిన ఆకట్టుకునే మూవీ టీం.. ఆ తరువాత మరో కంటెంట్ ని రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఏడాది తరువాత అల్లు అర్జున్ బర్త్ డేకి టీజర్ ని తీసుకు వస్తున్నారు.

ఆల్రెడీ ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కచ్చితమైన టైంని అనౌన్స్ చేయలేదు. తాజాగా ఆ టైంని అనౌన్స్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.07 నిమిషాలకు టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ టీజర్ ఆడియన్స్ కి కచ్చితంగా గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు.

Also read : Family Star : ఆ సమస్య గురించి దిల్ రాజుకి ముందే చెప్పి.. హెచ్చరించిన విజయ్ దేవరకొండ.. ఏంటది..!

కాగా ఈ టీజర్ ని జాతర సీక్వెన్స్ తో కట్ చేసారని తెలుస్తుంది. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలైట్ ఉండబోతుందట. జాతర బ్యాక్ డ్రాప్ లో ఓ సాంగ్ అండ్ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఇప్పుడు ఆ హైలైట్ సీక్వెన్స్ తోనే టీజర్ ని సిద్ధం చేసారని, దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.