TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

TVS iQube e-scooter : ఐక్యూబ్ బేస్ వేరియంట్ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందిస్తోంది. అలాగే అప్‌డేట్‌లో భాగంగా, టాప్-స్పెషిఫికేషన్లలో ఎస్టీ మోడల్ 2 బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది.

TVS iQube e-scooter : కొత్త వేరియంట్లతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్, ధర ఎంతంటే?

TVS iQube e-scooter gets new variants (Image Credit : Google )

TVS iQube e-scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ప్రముఖ మోటార్ కంపెనీ టీవీఎస్ నుంచి రెండు సరికొత్త వేరియంట్లతో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ లైనప్‌ను కంపెనీ పునరుద్ధరించింది. ఇప్పటికే మూడు వేరియంట్లు ఉండగా.. కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్, టాప్-ఎండ్ వేరియంట్‌లను రెండింటిని చేర్చింది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!

దాంతో ఐక్యూబ్ ఇప్పుడు మొత్తం 5 విభిన్న వేరియంట్‌లను కలిగి ఉంది. ఐక్యూబ్ బేస్ వేరియంట్ ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందిస్తోంది. అలాగే అప్‌డేట్‌లో భాగంగా, టాప్-స్పెషిఫికేషన్లలో ఎస్టీ మోడల్ 2 బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. దీని టాప్-ట్రిమ్ ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది.

సింగిల్ ఛార్జ్‌పై 75కి.మీ టాప్ స్పీడ్ :
టీవీఎస్ లైనప్‌లో కొత్త బేస్ వేరియంట్ ఐక్యూబ్ మోడల్ 2.2kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 75కిలోమీటర్ల పరిధితో వస్తుంది. గంటకు 75 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో హై వేరియంట్ కూడా ఉంది. భారీ 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పాత ఎంట్రీ-లెవల్ ఐక్యూబ్ మాదిరిగానే ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైవేరియంట్ ధర :
రెండు ఏళ్ల క్రితం ప్రకటించిన తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ మోడల్ కూడా అరంగేట్రం చేసింది. టాప్-స్పెషిఫికేషన్లతో కూడిన ఎస్టీ స్కూటర్ 3.4kWh, 5.1kWh అనే 2 బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఎస్టీ స్కూటర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు అలెక్సా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, టీపీఎమ్ఎస్‌తో కూడిన 7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. 3.4kWh బ్యాటరీతో ఎస్టీ ధర రూ. 1.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

5.1kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ భారతీయ మార్కెట్లో అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. టీవీఎస్ స్కూటర్ రేంజ్ 150కిమీ కాగా.. గరిష్ట వేగం గంటకు 82కిమీ ప్రయాణించగలదు. ఈ ఫుల్ ఫ్యాట్ ఫీచర్-ప్యాక్డ్ స్కూటర్ ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. టీవీఎస్ ప్రకారం.. జూలై 15, 2022లోపు ఎస్టీని ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లందరూ రూ. 10వేల లాంచింగ్ బోనస్‌తో ఎస్టీ వేరియంట్‌లను కొనుగోలు చేయొచ్చు.

Read Also : Ampere Nexus Electric Scooter : ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. 93కి.మీ టాప్ స్పీడ్.. ధర ఎంతో తెలుసా?