గుడ్‌న్యూస్.. బరువు తగ్గడానికి వాడే ఔషధాల వల్ల ఏం జరుగుతోందో తెలుసా?

Slash Heart Attack Risk: హృదయ ఆరోగ్యానికి గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు.

గుడ్‌న్యూస్.. బరువు తగ్గడానికి వాడే ఔషధాల వల్ల ఏం జరుగుతోందో తెలుసా?

Study in Weight Loss

మారిన ఆహారపు అలవాట్లతో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. మళ్లీ బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గడం కోసం చాలా మంది ఔషధాలను తీసుకుంటున్నారు. అయితే, బరువు తగ్గే ఔషధాల వల్ల గుండె పోటు ముప్పు కూడా తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది.

ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు హృదయ ఆరోగ్యానికి గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పారు. ఊబకాయం ఉన్న వారిలో ఆ ఔషధాలు తీసుకుంటే అంతగా బరువు తగ్గకపోయినప్పటికీ వారిలో గుండెపోటు, స్ట్రోక్‌ల ముప్పును ఈ మందులు గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు. హృదయ సంబంధ వ్యాధుల ముప్పును తగ్గించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.

లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ డీన్‌ఫీల్డ్ దీనిపై మాట్లాడుతూ.. ఈ ఔషధాల వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

వెగోవి, ఓజెంపిక్, రైబెల్సస్‌ పేర్లతో విక్రయించే బరువు తగ్గించే ‘సెమాగ్లుటైడ్’ ఔషధం ఊబకాయం ఉన్న వారిలో బరువు తగ్గుదలతో పాటు గుండె ఆరోగ్య కోసం అదనపు ప్రయోజనాలను అందించగలదా? అన్న అంశంపై పరిశోధకులు అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 41 దేశాల నుంచి 17,600 మంది నుంచి ఐదు సంవత్సరాల పాటు తీసుకున్న డేటాను విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు.

Also Read : 200ఎంపీ టెలిఫొటో కెమెరాతో వివో x100 అల్ట్రా ఫోన్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!