Pakistan : అయ్యో పాకిస్తాన్.. ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌కు ముందే బిగ్ షాక్..
టీ20 ప్రపంచకప్ 2024లో తన మొదటి మ్యాచ్‌కు సిద్దమవుతున్న పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలింది.
Pakistan – T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో తన మొదటి మ్యాచ్‌కు సిద్దమవుతున్న పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలింది. పొట్టి ప్రపంచకప్‌లో గురువారం (జూన్ 6న) డల్లాస్ వేదికగా అమెరికాతో పాకిస్తాన్ తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం దూరం అయ్యాడు. వసీం పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకునేందుకు దాదాపు వారం రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో అమెరికాతో మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడని పాక్ కెప్టన్ బాబర్ ఆజం చెప్పాడు.
అతడు త్వరగా కోలుకోవాలని బాబర్ ఆశిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌లకు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇమాద్ పాకిస్తాన్‌కు చాలా కీలక మైన ఆటగాడు. అతడు దూరం అయితే అది పాకిస్తాన్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం (జూన్ 9)న జరగనుంది.
టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు ఇదే..
బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్.