Bharateeyudu 2 : క్యాలెండర్ సాంగ్ వచ్చేసింది.. అందాల ఆరబోత
లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భారతీయుడు 2).
లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2(భారతీయుడు 2). జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన రాగా.. తాజాగా క్యాలెండర్ పాటను విడుదల చేసింది.
వైరముత్తు ఈ పాటను రాయగా సువి, ఐశ్వర్య సురేశ్ లు పాడారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్‌లో 2017 మిస్ యూనివర్స్ డెమి లెంగ్త్ లె టెబో కనిపించింది.
Kalki Collections : ‘కల్కి’ వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.. మొత్తం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు..?
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, సముద్రఖని, బ్రహ్మానందం, మధుబాల, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.