Kubera : ‘కుబేర’ నుంచి రష్మిక గ్లింప్స్.. బ్యాగ్‌లో ఏముంది..?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'కుబేర'.

Rashmika Mandanna first look glimpse from kubera
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం కుబేర. కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ చిత్రంగా తమిళం, తెలుగులో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన నాగార్జున, ధనుష్ ఫస్ట్ లుక్‌లకు మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
Bimbisara prequel : బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్.. దర్శకుడు మారిపోయాడు..
Here’s the intriguing and captivating first look of @iamRashmika from the world of #SekharKammulasKubera ?
– https://t.co/xtu0DhkFP1@dhanushkraja King @iamnagarjuna @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/9U5dMk6I2m
— Kubera Movie (@KuberaTheMovie) July 5, 2024
నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక అక్కడ గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీసింది. ఆ బ్యాగ్ మొత్తం డబ్బులతో నిండి ఉంది. దాన్ని చూసిన రష్మిక తెగ సంబర పడిపోయింది. బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌పై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు..