Bimbisara prequel : బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్.. దర్శకుడు మారిపోయాడు..
వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార.

Kalyan Ram announces Bimbisara prequel
వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన, వశిష్ఠ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్‌ను చేయనున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా బింబిసార ప్రీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే.. ఈ మూవీ బింబిసార డైరెక్ట్ చేసిన వశిష్ఠ కాకుండా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌పై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు..
??? ????? ?? ??????? ??? ?????? ?? ? ?????? ??? ????? ??????????? ???? ?????? ????????? ?#NKR22 – A PREQUEL to the blockbuster #Bimbisara ❤️?
Happy Birthday, @NANDAMURIKALYAN ✨
Exciting updates soon!… pic.twitter.com/yXEKzfVqRa
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024
త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే కొన్నేళ్ల ముందు పరిపాలించిన చక్రవర్తి ఇతివృత్తంతో ఈ సినిమా ఉండనున్నట్లు చెప్పింది. బింబిసారునికి పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన ఒక పురాణగాధను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 22వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా NKR22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు.