NKR21 : నిప్పుతో ఆడుకుంటున్న కళ్యాణ్ రామ్.. ఫ్యాన్స్‌కు పండగే..
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.

First look poster released from Nandamuri Kalyan Ram 21st movie
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. యంగ్ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్టన్‌లో ఆయన ఓ కొత్త మూవీలో నటిస్తున్నారు. NKR21 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
కాగా.. ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఓ కుర్చీపై కళ్యాణ్ రామ్ కూర్చుకుని ఉన్నాడు. అతడి పిడికిలి బిగించి ఉండగా, నిప్పు అంటుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి చుట్టూ రౌడీలు ఉండగా చాలా తీక్షణంగా చూస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
Sonu Sood : సోనూసూద్‌కు కుమారి ఆంటీ బంఫర్ ఆఫర్.. నవ్వులే నవ్వులు..
కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తోండగా విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది వరకే విజయశాంతికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
?? ??? ???’? ?? ? ???? ???????, ?? ? ???????? ??????? ⚠️
Here’s the Fiery First Look of #NKR from #NKR21 ?
Happy Birthday, @NANDAMURIKALYAN ❤?#HappyBirthdayNKR ❤️?@vijayashanthi_m @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981… pic.twitter.com/6ErzgpmOOE
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024