Mahesh Babu : రాజమౌళి సినిమా కోసం నాజర్ దగ్గర ట్యూషన్‌కి వెళ్తున్న మహేష్.. అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేష్..

తాజాగా మహేష్ బాబు - రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Mahesh Babu : రాజమౌళి సినిమా కోసం నాజర్ దగ్గర ట్యూషన్‌కి వెళ్తున్న మహేష్.. అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేష్..

Mahesh Babu Learning Dialect Lessons from Naasar for Rajamouli Movie

Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమం కూడా చేయలేదు. ఈ విషయంలో మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు అయినా తమ హీరో నుంచి సినిమా రాదు అలాంటిది అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వకపోతే ఎలా అంటున్నారు ఫ్యాన్స్.

అయితే SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గానే జరుగుతుందని సమాహారం. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా జరుగుతుందని పలువురు తెలిపారు. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాకి కావాల్సిన లుక్ లోకి మారుతున్నాడు. మరోవైపు ఈ సినిమాకు కావాల్సిన శిక్షణలు తీసుకుంటున్నాడు. మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా రోజూ మహేష్ – రాజమౌళి సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

Also Read : మహేశ్‌బాబు, రాజమౌళి సినిమాపై సస్పెన్స్‌ వీడిపోనుందా?

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. మహేష్ బాబు సీనియర్ నటుడు నాజర్ దగ్గర భాషకి సంబంధించిన యాసలో, అలాగే హావభావాల్లో ట్యూషన్ తీసుకుంటున్నాడట. గతంలో బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ నాజర్ దగ్గర ఈ విషయంలో ట్యూషన్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ కూడా నాజర్ దగ్గర యాస, హావభావాల్లో మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం. రాజమౌళి సినిమాల్లో పర్ఫెక్షనిజం ఉండేలా చూసుకుంటాడు. ఇందుకోసమే మహేష్ స్టార్ హీరో అయినా నాజర్ దగ్గర మెళకువలు నేర్చుకుంటున్నారని తెలుస్తుంది. గతంలో నాజర్ – మహేష్ కలిసి చాలా సినిమాల్లో పని చేసిన సంగతి తెలిసిందే.