James Anderson : లార్డ్స్‌లో వీడ్కోలు పరీక్ష.. భారీ రికార్డుల పై జేమ్స్ అండ‌ర్స‌న్ క‌న్ను.. ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం కాదు..

క్రికెట్‌లో మ‌రో శ‌కం ముగియ‌నుంది. ఇంగ్లాండ్ వెట‌ర‌న్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ త‌న కెరీర్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.

James Anderson : లార్డ్స్‌లో వీడ్కోలు పరీక్ష.. భారీ రికార్డుల పై జేమ్స్ అండ‌ర్స‌న్ క‌న్ను.. ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం కాదు..

James Anderson eye on Huge Milestone During His Farewell Test

James Anderson : క్రికెట్‌లో మ‌రో శ‌కం ముగియ‌నుంది. ఇంగ్లాండ్ వెట‌ర‌న్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ త‌న కెరీర్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు. బుధ‌వారం (జూలై 10) లార్డ్స్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగే తొలి టెస్టు మ్యాచే అండ‌ర్స‌న్ కెరీర్‌లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ కానుంది. ఈ క్ర‌మంలో ప‌లురికార్డులు అండ‌ర్స‌న్ ను ఊరిస్తున్నాయి.

జేమ్స్ అండ‌ర్స‌న్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 187 టెస్టు మ్యాచులు ఆడాడు. 700 వికెట్లు తీశాడు. ఇందులో 32 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న ఉంది. కాగా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో ప్ర‌స్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. త‌న ఆఖ‌రి టెస్టు మ్యాచులో 9 లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీస్తే.. రెండ‌వ స్థానంతో త‌న కెరీర్‌ను ముగించ‌నున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ భావోద్వేగ‌పు పోస్ట్.. రాహుల్‌ భాయ్‌ నా నమ్మకం, నా కోచ్‌, నా స్నేహితుడు ..

టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత దివంగ‌త ఆస్ట్రేలియా ఆట‌గాడు షేన్ వార్న‌ర్ 708 వికెట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్ద‌రి త‌రువాత అండ‌ర్స‌న్ 700 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

1000 వికెట్ల‌కు 13 దూరంలో..

అండ‌ర్స‌న్ త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 987 వికెట్లు తీశాడు. 187 టెస్టుల్లో 700 వికెట్లు, 194 వ‌న్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. త‌న ఆఖ‌రి టెస్టులో గ‌నుక 13 వికెట్లు లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీస్తే మాత్రం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 1000 వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు.

David Warner : రిటైర్‌మెంట్ పై డేవిడ్ వార్న‌ర్ యూట‌ర్న్‌..! ఇన్‌స్టాగ్రామ్‌లో సంచ‌ల‌న పోస్ట్‌..

శ్రీలంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్, ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ షేన్ వార్న్‌లు ఇద్ద‌రు మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 1000కి పైగా వికెట్లు తీశారు. ముత్త‌య్య త‌న కెరీర్‌లో 1347 వికెట్లు తీయ‌గా, వార్న్ 1001 వికెట్లు తీశాడు. ఒక‌వేళ 15 వికెట్లు గ‌నుక అండ‌ర్స‌న్ తీయ‌గ‌లిగితే.. వార్న్ ను అధిగ‌మిస్తాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..

* ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 1347 వికెట్లు
* షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 1001 వికెట్లు
* జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్‌) – 987 వికెట్లు
* అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 956 వికెట్లు
* గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 949 వికెట్లు.