Balakrishna : బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవ సంబరాలు.. అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ..

నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 కావోస్తుండటంతో ఓ పక్క అభిమానులు, మరో పక్క సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయనున్నారు.

Balakrishna : బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవ సంబరాలు.. అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ..

Nandamuri Balakrishna Completing 50 Years of Acting Career in Tollywood Fans and Film Industry Celebrating

Balakrishna 50 Years: జై బాలయ్య.. అని వినిపిస్తేనే ఓ ఊపు వస్తుంది. అంతలా బాలకృష్ణ అభిమానులకే కాక తెలుగు జనాలకు దగ్గరయ్యారు. తన సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తూ వరుస హిట్లు కొడుతూ, మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య బాబు మరోవైపు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ పేషంట్స్ కి చికిత్స అందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

బాలకృష్ణ 14 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ తాతమ్మ కల సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్నుంచి 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో కూడా ఇన్నేళ్ల సినీ కెరీర్ ఎవరికీ లేదు. తాతమ్మ కల 29 ఆగస్టు 1974లో రిలీజయింది. దీంతో నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 కావోస్తుండటంతో ఓ పక్క అభిమానులు, మరో పక్క సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయనున్నారు.

Also Read : Bharateeyudu 2 : భారతీయుడు 2 రివ్యూ.. సేనాపతి తిరిగొచ్చి ఏం చేశాడు?

నటనలో తన తండ్రి నందమూరి తారకరామారావు పేరు నిలబెట్టేలా పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక, మాస్, కమర్షియల్.. అన్ని రకాల సినిమాలు చేసి ఫ్యాన్స్ ని, తెలుగు ప్రేక్షకులని మెప్పించిన బాలయ్య నటుడిగా 50 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు అనంతపురం జగన్, బాలయ్య అభిమానులను ఒక టీమ్ గా ఏర్పాటుచేసి గ్రాండ్ గా 50 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. గతంలో NBK హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో 70 రోజుల పాటు భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేపట్టారు. ఆ తర్వాత బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను ఒకేసారి తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి రికార్డును సృష్టించారు. ఇప్పటికే బాలయ్యని కలిసి ఈ వేడుకల గురించి చెప్పారు. బాలయ్య కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.

ఇక మరో వైపు తెలుగు సినీ పరిశ్రమ కూడా హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇటీవల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఆధ్వర్యంలో నిర్మాతలు KL దామోదర్ ప్రసాద్, సునీల్ నారంగ్, ప్రసన్న కుమార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్.. పలువురు బాలయ్య బాబుని కలిసి శుభాకాంక్షలు తెలియచేసి సినీ పరిశ్రమ నుంచి 1 సెప్టెంబరు 2024న ఆయనకు సన్మానం చేస్తామని, అంగీకరించమని అడగ్గా బాలకృష ఓకే చెప్పారు. ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి అనేకమంది ప్రముఖులతో పాటు బాలయ్య అభిమానులు కూడా భారీగా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.