CMF Phone 1 First Sale : కొత్త సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

CMF Phone 1 First Sale : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలకు వీడియో కాల్స్ చేసేందుకు కెమెరా ముందు 16ఎంపీ షూటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా 1080పీ వీడియోలను 30ఎఫ్‌పీఎస్ వద్ద షూట్ చేయగలదు.

CMF Phone 1 First Sale : కొత్త సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

CMF Phone 1 available ( Image Source : Google )

CMF Phone 1 First Sale : ప్రముఖ నథింగ్ కంపెనీ సబ్-బ్రాండ్ సీఎమ్ఎఫ్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ CMF ఫోన్ 1 ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సేల్ సమయంలో సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ధర రూ. 14,999 వద్ద విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త మీడియాటెక్ 7300 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. బ్యాక్ కేసులు, కార్డ్ హోల్డర్, నెక్ స్ట్రాప్, ఫోన్ స్టాండ్ వంటి కొన్ని నిఫ్టీ హార్డ్‌వేర్ అప్లియన్సెస్‌తో స్మార్ట్‌ఫోన్ వస్తుంది.

Read Also : Honor MagicBook Art 14 : కొత్త హానర్ మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 ల్యాప్‌టాప్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

సీఎమ్ఎఫ్ ఫోన్ 1 ధర :
సీఎమ్ఎఫ్ ఫోన్ 1 మోడల్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999. ఫ్లిప్‌కార్ట్, సీఎమ్ఎఫ్ ఇండియా వెబ్‌సైట్, కంపెనీ రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో, సీఎమ్ఎఫ్ మొదటి సేల్ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లింపు చేయడం ద్వారా రూ. 1,000 తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను వరుసగా రూ. 14,999, రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి.

సీఎమ్ఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు :
సీఎమ్ఎఫ్ ఫోన్ 1 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను 2,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 960Hz పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌తో వస్తుంది. మొట్టమొదటి సీఎమ్ఎఫ్ ఫోన్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం మాలి జీ615 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2టీబీ వరకు విస్తరిస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందించిన నథింగ్ ఓఎస్ 2.6పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. లేటెస్ట్ డివైజ్‌తో రెండేళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, సెల్ఫీలకు వీడియో కాల్స్ చేసేందుకు కెమెరా ముందు 16ఎంపీ షూటర్ ఉంది. ఫ్రంట్ కెమెరా గరిష్టంగా 1080పీ వీడియోలను 30ఎఫ్‌పీఎస్ వద్ద షూట్ చేయగలదు.

బ్యాక్ కెమెరా 30 ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియోలను క్యాప్చర్ చేయగలదు. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, దుమ్ము స్ప్లాష్ నిరోధకతకు ఐపీ52 రేటింగ్ ఉంది. 13 5జీ బ్యాండ్‌లు, వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్ సపోర్టు ఇస్తుంది. సీఎమ్ఎఫ్ ఫోన్ 1 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Xiaomi SU7 Electric Car : షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!