IND vs ZIM 5th T20 : జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం

హ‌రారే వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్ జ‌రిగింది.

IND vs ZIM 5th T20 : జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం

Pic Credit: @ZimCricketv twitter

జింబాబ్వేపై టీమిండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 167/6 స్కోరు చేసిన విషయం తెలిసిందే. లక్ష్యఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లకే 125 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటర్లలో మేయర్స్‌ 34, మరుమని 27 మినహా ఎవరూ రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 4, శివం 2, తుషార్‌, వాషింగ్టన్‌, అభిషేక్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు. ఈ సిరీస్‌లో భారత్‌ 4-1 తేడాతో విజయం సాధించింది.

డియోన్ మైయర్స్ అవుట్.. 4వ వికెట్ డౌన్
85 పరుగుల వద్ద జింబాబ్వే 4వ వికెట్ కోల్పోయింది. డియోన్ మైయర్స్ 34 పరుగులు చేసి శివం దూబే బౌలింగ్ లో అవుటయ్యాడు. 13 ఓవర్లలో 86/4 స్కోరుతో జింబాబ్వే ఆట కొనసాగిస్తోంది.

10 ఓవర్లలో 69/3
జింబాబ్వే 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. తడివానాషే మారుమణి(27) మూడో  వికెట్ గా అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ఈ వికెట్ తీశాడు.

15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 15 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. వెస్లీ మాధేవెరే (0), బ్రియాన్ బెన్నెట్ (10) అవుటయ్యారు. వీరిద్దరినీ ముఖశ్ కుమార్ అవుట్ చేశాడు.  5 ఓవర్లలో 31/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

జింబాబ్వే టార్గెట్ 168
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 167 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో సంజూశాంస‌న్ (58; 45 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. శివ‌మ్ దూబె(26) రియాన్ ప‌రాగ్ (22) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజరబానీ రెండు వికెట్లు తీశాడు. బ్రాండన్ మవుటా, సికింద‌ర్ ర‌జా, రిచర్డ్ నగరవ త‌లా ఓ వికెట్ తీశారు.

సంజూ శాంస‌న్ ఔట్‌.. 
ముజరబానీ బౌలింగ్‌లో మారుమణి క్యాచ్ అందుకోవ‌డంతో సంజూశాంస‌న్ (58) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 17.3 ఓవ‌ర్‌లో 135 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

సంజూ శాంస‌న్ హాఫ్ సెంచ‌రీ..
సికింద‌ర్ రజా బౌలింగ్‌లో రెండు ప‌రుగులు తీసి 39 బంతుల్లో సంజూ శాంస‌న్ హాప్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.


రియాన్ ప‌రాగ్ ఔట్‌.. 
బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో రిచర్డ్ నగరవ క్యాచ్ అందుకోవ‌డంతో రియాన్ ప‌రాగ్ (22) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 14.2 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌.. 
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో సికింద‌ర్ ర‌జా క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (13) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 4.6వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

అభిషేక్ శ‌ర్మ ఔట్‌.. 
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్‌లో క్లైవ్ మదాండే క్యాచ్ అందుకోవ‌డంతో అభిషేక్ శ‌ర్మ (14) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 3.5వ ఓవ‌ర్‌లో 38 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది.

య‌శ‌స్వి జైస్వాల్ క్లీన్‌బౌల్డ్‌..
తొలి ఓవ‌ర్‌లోనే భార‌త్‌కు షాక్ త‌గిలింది. సికింద‌ర్ ర‌జా బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ (12; 5 బంతుల్లో 2 సిక్స‌ర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 0.4వ ఓవ‌ర్‌లో 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 15 1. గిల్ (0), అభిషేక్ శ‌ర్మ (2) లు ఆడుతున్నారు.

భారత తుది జ‌ట్టు..
శుభమన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్

జింబాబ్వే తుది జ‌ట్టు..
వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీప‌ర్‌), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ

India vs Zimbabwe : ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో నామ‌మాత్ర‌మైన ఐదో టీ20 మ్యాచ్ హ‌రారే వేదిక‌గా జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచింది. కెప్టెన్ సికింద‌ర్ ర‌జా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.