భార్య దెబ్బకు జొమాటోకు భర్త రిక్వెస్ట్.. కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన సంస్థ.. అదేమిటంటే?

జొమాటో కొత్త ఫీచర్ తీసుకురావడానికి కారణం కరణ్ సింగ్ అనే వ్యక్తి. తన భార్య దెబ్బకు అతను జొమాటోకు తన బాధను తెలియజేశాడు.

భార్య దెబ్బకు జొమాటోకు భర్త రిక్వెస్ట్.. కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చిన సంస్థ.. అదేమిటంటే?

zomato

Zomato Delete Order Feature : పట్టణాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రిత్యా ఉరుకులు పరుగుల జీవితంతో ఇంట్లో ఆహారాన్ని తయారు చేసుకొని తినేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కువ మంది వాటిపైనే ఆధారపడుతున్నారు. ఆన్‌లైన్ డెలివ‌రీ సంస్థల్లో జొమాటో ఒకటి. జొమాటో తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆపర్లతోపాటు.. యాప్ లో కొత్తకొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తద్వారా వినియోగదారుడు ఆర్డర్ చేసిన ఫుడ్ వేగంగా వారి వద్దకు చేరవేస్తోంది. తాజాగా జొమాటో ఓ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

Also Read : ట్రంప్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్.. అతని సతీమణి భారత సంతతి మహిళ.. ఆమె ఎవరంటే?

జొమాటో కొత్త ఫీచర్ తీసుకురావడానికి కారణం కరణ్ సింగ్ అనే వ్యక్తి. తన భార్య దెబ్బకు అతను జొమాటోకు తన బాధను తెలియజేశాడు. కరణ్ సింగ్ పేర్కొన్న వివరాల ప్రకారం.. జొమాటో.. నేను ఇప్పుడు అర్థరాత్రి ఆర్డర్ లను చేయలేను. ఎందుకంటే.. జొమాటో యాప్ లో నా ఆర్డర్ హిస్టరీని నా భార్య తనిఖీ చేసింది. దీంతో నేను అర్ధరాత్రి వేళ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నట్లు గుర్తించి. నేను ఆర్డర్ చేసిన ఫుడ్ వివరాలు నా భార్యకు తెలియకుండా ఉండేలా హిస్టరీ డిలీట్ చేద్దామంటే ఆ ఆప్షన్ లేదు. ఇక బైబై జొమాటో.. నేను మీ యాప్ ద్వారా ఇకముందు ఫుడ్ ఆర్డర్ చేయాలంటే హిస్టరీని తొలగించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురండి అంటూ కరణ్ సింగ్ జొమాటోకు విజ్ఞప్తి చేశాడు.

Also Read : రత్న భండార్ రహస్యం..! జగన్నాథుడి చెక్కపెట్టెల్లో ఏముంది? ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలను లెక్కించడం ఎలా?

కరణ్ సింగ్ ఇబ్బందిని సీరియస్ గా తీసుకున్న జొమాటో.. డిలీట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జొమాటో సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటి వరకు కస్టమర్లు చేసిన ఫుడ్ ఆర్డర్లు వారి యాప్ హిస్టరీలో ఉంటున్నాయి. వాటిని తొలగించే వీలులేకపోవటంతో కొందరు వినియోగదారులు తమకు ఎదురయ్యే ఇబ్బందులకు తమ దృష్టికి తీసుకొచ్చారు. కొంచెం ఆలస్యమైనా ఇప్పటి నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. డిలీట్ ఆర్డర్ ఆప్షన్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన హిస్టరీని తొలగించవచ్చు అంటూ దీపిందర్ గోయల్ పేర్కొన్నాడు. దీంతో పలువురు వినియోగదారులు జొమాటో సంస్థ తీసుకొచ్చిన హిస్టరీ డిలీట్ ఆప్షన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.