కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు.. బరువు ఎంత తగ్గాడంటే?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆప్ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు.

కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన తీహార్ జైలు అధికారులు.. బరువు ఎంత తగ్గాడంటే?

Delhi CM Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం జైలు అధికారులు లేఖ రాశారు. అరవింద్ కేజ్రీవాల్ జైలులో 8.5 కిలోల బరువు తగ్గలేదు. కేజ్రీవాల్ జైలులో రెండు కిలోల బరువు మాత్రమే తగ్గారు. ఏప్రిల్ 1న తొలిసారిగా తీహార్‌ జైలుకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ బరువు 65 కేజీలు ఉంది. ఎన్నికల ప్రచారం పూర్తి చేసి జూన్ 2న తిరిగి తీహార్ జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 63.5 కేజీలు ఉందని తీహార్ జైలు అధికారులు లేఖలో పేర్కొన్నారు.

Also Readసైబర్ నేరగాళ్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన యువకుడు.. ఎలా అంటే?

జూలై 14న కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలు. రెండు కిలోల బరువు మాత్రమే కేజ్రీవాల్ తగ్గారు. ఉద్దేశపూర్వకంగానే స్పష్టమైన కారణాలతో కేజ్రీవాల్ బరువు తగ్గారు. కేజ్రీవాల్ ఇంటి భోజనాన్ని తీసుకోవడం లేదు. AIIMS మెడికల్ బోర్డు నిరంతరం కేజ్రీవాల్‌ను పర్యవేక్షిస్తోందని జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మెడికల్ బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకు, వారిని తప్పుదోవ పట్టించడానికి ఆప్ తప్పుడు ప్రచారం చేస్తుందని జైలు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.