ఈ జిల్లాల్లో చాలామంది రైతులకు రుణమాఫీ కావట్లేదు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

ఈ జిల్లాల్లో చాలామంది రైతులకు రుణమాఫీ కావట్లేదు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కావట్లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్‌లో స్కాం ఉంటుందని చెప్పారు. రుణమాఫీ కొంతమందికే చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన విధంగానే ఇప్పుడు చేస్తున్నారని తెలిపారు.

ఇవాళ అసెంబ్లీ హాల్లో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ అని మొదట చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది ప్రజా పాలన కాదని చెప్పారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని తెలిపారు. రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని, లేదంటే అసెంబ్లీ, సచివాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టడానికే అసెంబ్లీలో చర్చ ముందుకు తెస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల డేటా సరిగా ఇవ్వలేదని అన్నారు.

Also Read: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్