AP Assembly Session 2024: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. Live Updates

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.

AP Assembly Session 2024: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. Live Updates

AP Assembly budget session 2024

AP Budget Session 2024 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవటంతో జగన్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 22 Jul 2024 11:10 AM (IST)

    అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది.
    ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్నది నిర్ణయం తీసుకుంటుంది.
    ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • 22 Jul 2024 11:08 AM (IST)

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు ముగిశాయి. సమావేశాలు ప్రారంభం కాగానే .. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది.

  • 22 Jul 2024 10:56 AM (IST)

    అసెంబ్లీ నుండి తాడేపల్లి నివాసానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లిపోయారు.
    రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు

  • 22 Jul 2024 10:54 AM (IST)

    అసెంబ్లీలోని తన చాంబర్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  వైఎస్ జగన్ సమావేశం అయ్యారు.

  • 22 Jul 2024 10:51 AM (IST)

    ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసింది.

  • 22 Jul 2024 10:31 AM (IST)

    అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

    ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
    శాసనసభ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
    విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది. రాజధాని హైదరాబాద్ ను కోల్పోయాం.
    సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషి చేశారు.
    2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది.
    రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు.
    2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని గవర్నర్ తెలిపారు.

  • 22 Jul 2024 10:25 AM (IST)

    ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్
    శాంతి భద్రతలు క్షీణించాయని ప్లకార్డ్స్ తో వైసీపీ నిరసన
    గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

  • 22 Jul 2024 10:18 AM (IST)

    రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని సభలో వైసీపీ సభ్యులు నిరసన.
    హత్య రాజకీయాలు నశించాలని నినాదాలు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు.

  • 22 Jul 2024 10:17 AM (IST)

    గవర్నర్ ప్రసంగంపై అడుగడుగున అడ్డు తగులుతున్న వైసీపీ.
    సభలో నిరసన తెలుపుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.
    గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు.

  • 22 Jul 2024 10:15 AM (IST)

    అసెంబ్లీ సమావేశాలు లైవ్..

  • 22 Jul 2024 10:14 AM (IST)

    అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
    ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగుతుంది.

  • 22 Jul 2024 10:12 AM (IST)

    వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    చంద్రబాబుతోపాటు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
    చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన రాజధాని రైతులు, వెంకటపాలెం గ్రామస్థులు

  • 22 Jul 2024 10:11 AM (IST)

    అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించేందుకు నిర్ణయం.
    సాధారణంగా ఎమ్మెల్యే లు అసెంబ్లీ 4వ నంబరు గేటు బయట దిగి లోపలికి వెళ్లేలా నిబంధనలు.
    ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం తీసుకోవాలని నిర్ణయం
    వైసీపీ శాసన సభపక్ష విన్నపం మేరకు నిర్ణయం