వైఎస్ జగన్‌ను పలకరించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?

అసెంబ్లీ లాబీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. హాయ్ జగన్ అంటూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిని పలకరించినట్లు చెప్పారు.

వైఎస్ జగన్‌ను పలకరించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?

YS Jagan Mohan Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఇదిలాఉంటే.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్.. అంటూ అసెంబ్లీలో జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి రఘురామ పలుకరించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరగా.. హాజరవుతానని జగన్ బదులిచ్చారు.

Also Read : Pawan Kalyan : డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఏం మారలేదు.. అదే స్టైల్.. అదే పవర్ ఫుల్ వాక్..

జగన్, రఘురామ మధ్య కొన్ని నిమిషాలు ఆసక్తికర చర్చ జరిగింది. కొద్దిసేపటి తరువాత జగన్ ముభావంగా ఉండటంతో రఘురామ అక్కడి నుంచి వచ్చేశారు. జగన్ చేతిలో చేయివేసి రఘురామ మాట్లాడినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. జగన్ తో మాట్లాడిన తరువాత పయ్యావుల కేశవ్ వద్దకు రఘురామ వచ్చారు.. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కోరారు. దీంతో కేశవ్ నవ్వుతూ అలాగే అంటూ వెళ్లిపోయారు.

Also Read : అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు జగన్ సీరియస్ వార్నింగ్.. పోలీసులు ఏం చేశారంటే..?

అసెంబ్లీ లాబీలో రఘురామ కృష్ణరాజు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. హాయ్ జగన్.. అంటూ అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డిని పలకరించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరానని, వచ్చే సమావేశాల నుంచి జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని ఆశిస్తున్నానని రఘురామ అన్నారు. జగన్ శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నానని, అసెంబ్లీలో ఆయన పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరతానని అన్నారు.

గతంలో పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో హత్య చేయించేందుకు ప్రయత్నించారంటూ జగన్ మోహన్ రెడ్డిపై రఘురామ కృష్ణరాజు ఇటీవల కేసు పెట్టిన విషయం తెలిసిందే. జగన్ పై కేసు పెట్టడం పట్ల రఘురామపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా అసెంబ్లీలో జగన్, రఘురామ సరదాగా మాట్లాడుకోవటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.