శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక

విశాఖ భూదందా వివాదాల్లో శాంతితో పాటు సుభాష్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరుగుతోంది. అన్ని ఆధారాలను ఏదో ఒకరోజు అసెంబ్లీలో కూడా పెడతాం.

శాంతి నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవు- మంత్రి ఆనం హెచ్చరిక

Minister Anam RamaNarayana Reddy (Photo Credit : Google)

Minister Anam RamaNarayana Reddy : దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి నియామకంపైనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె నియామకం అక్రమమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి నియామకం జరిగినప్పుడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ లో సెక్రటరీ గా ఉన్నారని, నియామకం లో తప్పులు జరిగితే పీఎస్సార్ కూడా బాధ్యుడే అని మంత్రి ఆనం స్పష్టం చేశారు. శాఖాపర విచారణ పూర్తై తగిన ఆధారాలు సేకరించాక ఏపీపీఎస్సీని వివరణ కోరతామన్నారు. అసెంబ్లీ లాబీలో మంత్రి ఆనం చిట్ చిట్ చేశారు.

”శాంతి విశాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు వివాదాస్పద చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రేమ సమాజం, ఇతర భూముల విషయంలో ఆమెపై ఉన్న అనేక ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది. విశాఖ భూదందా వివాదాల్లో శాంతితో పాటు సుభాష్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరుగుతోంది. అన్ని ఆధారాలను ఏదో ఒకరోజు అసెంబ్లీలో కూడా పెడతాం. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో 46 ఆలయాలు పునర్నిర్మాణం చేయాలి. ఇందుకు రూ.36 కోట్లు పరిహారం నిధులు వచ్చి ఉన్నాయి. ఆలయాలు నిర్మించలేదు కాబట్టి నిధులు విడుదల కాలేదు. ఆలయ నిర్మాణాలు జరిగితే నిధులు విడుదల అవుతాయ”ని మంత్రి ఆనం తెలిపారు.

Also Read : జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్