Rs.15,000 Crore for AP : కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్ద పీట.. కేటాయింపులు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ శుభవార్త చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులు ఇవే..
– రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు
– పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం
– పరిశ్రమల ఏర్పాట్లుకు ప్రత్యేక రాయితీలు
– విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు
– విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం
– రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు
– ఏపీలో పూర్వోదయ పథకం అమలు.
– నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ల ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు