పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడవైపు వెళ్లే రైళ్లకు అంతరాయం

గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడవైపు వెళ్లే రైళ్లకు అంతరాయం

Goods Train

Updated On : July 23, 2024 / 7:00 AM IST

Goods Train Derailed : గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరులోని బిట్రగుంట రైల్వే స్టేషన్ యార్డులో తెల్లవారుజామున 5గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మరమ్మతలుచేపట్టారు.

Also Read : ప్లాన్ B అమలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..! బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే టార్గెట్‌

అత్యవసర రైళ్లకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అత్యవసర రైళ్లను మూడో లైన్ లో పంపాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు మిగిలిన రైళ్లకు కూడా అంతరాయం లేకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడవైపు వెళ్లే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొద్ది గంటల తరువాత రైళ్ల రాకపోకలు యథావిధిగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.