Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ లో ఏఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ లో ఏఏ రంగానికి ఎంత కేటాయించారంటే?

Bhatti Vikramarka

Bhatti Vikramarka : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్దకాలంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి అడుగంటిందని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని బీఆర్ఎస్ పాలనపై భట్టి విమర్శలు గుప్పించారు.

Also Read : మ‌ల‌క్‌పేట‌ అంధ బాలికల వసతి గృహంలో అమానుషం.. మంత్రి సీతక్క సీరియస్

తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,91,159 కోట్లు. మూలధన వ్యయం రూ. 33,487 కోట్లు కాగా భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు కాగా.. పన్నేతర ఆదాయం రూ. 35,208.44 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు. కేంద్రం గ్రాంట్లు రూ. 21,636.15 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు.

 

వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659 కోట్లు
హార్టికల్చర్ : రూ. 737 కోట్లు
పశుసంవర్ధక శాఖ రూ. 19,080కోట్లు
మహాలక్ష్మి ఉచిత రవాణా రూ. 723కోట్లు
గృహజ్యోతి పథకం రూ. 2,418 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థ : రూ. 3,836 కోట్లు
పంచాయతీ రాజ్ : రూ. 29816 కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్ : రూ. 50కోట్లు
హైదరాబాద్ అభివృద్ధి : రూ. 10,000కోట్లు
జీహెఎంసీ : రూ. 3000 కోట్లు
హెచ్ ఎండీఏ : రూ.500 కోట్లు
మెట్రో వాటర్ : రూ. 3385 కోట్లు
హైడ్రా సంస్థకు : రూ.200 కోట్లు
ఏయిర్ పోర్టుకు మెట్రో : రూ.100కోట్లు
ఓఆర్ ఆర్ : రూ.200కోట్లు
హైదరాబాద్ మెట్రో : రూ.500కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రో : రూ. 500కోట్లు
మూసీ అభివృద్ధి : రూ.1500కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు : రూ.1500కోట్లు
స్ర్తీ ,శాశు సంక్షేమ శాఖ : రూ.2736 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : రూ.17000 కోట్లు
మైనారిటీ సంక్షేమం : రూ.3000 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.9200 కోట్లు
వైద్య ఆరోగ్యం : రూ.11468 కోట్లు
విద్యుత్ శాఖ : రూ.16410 కోట్లు
అడవులు, పర్యావరణం : రూ.1064 కోట్లు
ఐటీ శాఖకు : రూ. 774కోట్లు
నీటి పారుదల శాఖకు : రూ.22301 కోట్లు
విద్యాశాఖకు : రూ. 21292 కోట్లు
హోంశాఖ : రూ. 9564 కోట్లు
ఆర్ అండ్ బి శాఖకు : రూ. 5790 కోట్లు

రీజినల్ రింగ్ రోడ్డు రూ. 1525 కోట్లు