Telangana Budget 2024 : రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క.. హాజరైన కేసీఆర్.. live updates

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

Telangana Budget 2024 : రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క.. హాజరైన కేసీఆర్.. live updates

Telangana Assembly budget 2024

Telangana Assembly budget 2024 : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 25 Jul 2024 01:46 PM (IST)

    హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

    హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 10వేల కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని మెట్రో వాటర్ వర్క్స్ కోసం రూ. 3,385 కోట్లు, సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తున్న హైడ్రా కు రూ. 200 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు కేగాయించగా.. పాత బస్తీలో మెట్రో మెట్రో విస్తరణఖు రూ. 500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కొరకు రూ. 50 కోట్లు కేటాయించగా.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కొరకు రూ. 1,500 కోట్లు రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు.

  • 25 Jul 2024 12:23 PM (IST)

    తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.
    తెలంగాణ ఏర్పాటు నాటికి 7,55,77కోట్ల అప్పు.
    ఈ ఏడాది డిసెంబర్ నాటికి 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది.
    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు.

    వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
    వ్యవసాయం ,అనుబంధ రంగాలకు : 72,659 కోట్లు
    హార్టికల్చర్ : రూ. 737 కోట్లు
    పశుసంవర్ధక శాఖ రూ. 19,080కోట్లు
    మహాలక్ష్మి ఉచిత రవాణా రూ. 723కోట్లు
    గృహజ్యోతి పథకం రూ. 2,418 కోట్లు
    ప్రజాపంపిణీ వ్యవస్థ : రూ. 3,836 కోట్లు
    పంచాయతీ రాజ్ : రూ. 29816 కోట్లు
    మహిళా శక్తి క్యాంటిన్ : రూ. 50కోట్లు
    హైదరాబాద్ అభివృద్ధి : రూ. 10,000కోట్లు
    జీహెఎంసీ : రూ. 3000 కోట్లు
    హెచ్ ఎండీఏ : రూ.500 కోట్లు
    మెట్రో వాటర్ : రూ. 3385 కోట్లు
    హైడ్రా సంస్థకు : రూ.200 కోట్లు
    ఏయిర్ పోర్టుకు మెట్రో : రూ.100కోట్లు
    ఓఆర్ ఆర్ : రూ.200కోట్లు
    హైదరాబాద్ మెట్రో : రూ.500కోట్లు
    ఓల్డ్ సిటీ మెట్రో : రూ. 500కోట్లు
    మూసీ అభివృద్ధి : రూ.1500కోట్లు
    రీజినల్ రింగ్ రోడ్డు : రూ.1500కోట్లు
    స్ర్తీ ,శాశు సంక్షేమ శాఖ : రూ.2736 కోట్లు
    ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం : రూ.17000 కోట్లు
    మైనారిటీ సంక్షేమం : రూ.3000 కోట్లు
    బీసీ సంక్షేమం : రూ.9200 కోట్లు
    వైద్య ఆరోగ్యం : రూ.11468 కోట్లు
    విద్యుత్ శాఖ : రూ.16410 కోట్లు
    అడవులు, పర్యావరణం : రూ.1064 కోట్లు
    ఐటీ శాఖకు : రూ. 774కోట్లు
    నీటి పారుదల శాఖకు : రూ.22301 కోట్లు
    విద్యాశాఖకు : రూ. 21292 కోట్లు
    హోంశాఖ : రూ. 9564 కోట్లు
    ఆర్ అండ్ బి శాఖకు : రూ. 5790 కోట్లు

    రీజినల్ రింగ్ రోడ్డు రూ. 1525 కోట్లు

  • 25 Jul 2024 12:20 PM (IST)

    తెలంగాణ బడ్జెట్ రూ. 2,91,159 కోట్లు.

    రెవెన్యూ వ్యయం : 2,20, 945 కోట్లు

    మూలధన వ్యయం : 33, 487కోట్లు.

  • 25 Jul 2024 12:12 PM (IST)

    అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క.. Live

  • 25 Jul 2024 12:11 PM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్.
    కెసిఆర్ కు స్వాగతం పలికిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ కి వెళ్లిన కేసీఆర్

  • 25 Jul 2024 11:31 AM (IST)

    మరి కాసేపట్లో అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
    నందినగర్ నివాసం నుండి అసెంబ్లీ కి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • 25 Jul 2024 10:51 AM (IST)

    ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం.. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
    మధ్యాహ్నం 12గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.

  • 25 Jul 2024 10:22 AM (IST)

    శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

  • 25 Jul 2024 10:21 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఇందులో 2024-25 బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

  • 25 Jul 2024 10:19 AM (IST)

  • 25 Jul 2024 10:17 AM (IST)

    అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. స్వాగతం పలికిన ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు

  • 25 Jul 2024 10:16 AM (IST)

    ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరికొద్ది సేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    మంత్రిమండలి ఆమోదం కొరకు శాసనసభలో జరిగే కేబినెట్ సమావేశంలో 2024- 25 వార్షిక బడ్జెట్ గురించి ప్రజెంటేషన్ చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి విక్రమార్క.

  • 25 Jul 2024 10:14 AM (IST)

    శాసనసభలో 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు.

  • 25 Jul 2024 10:13 AM (IST)

    ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

  • 25 Jul 2024 10:11 AM (IST)

    తెలంగాణ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి

    వాస్తవికతకు దగ్గరగా 2024-25 వార్షిక బడ్దెట్

    2.8 లక్షల కోట్లుగా తెలంగాణ బడ్జెట్?

    బడ్దెట్ లో ఆరు గ్యారంటీలకు అధిక కెటాయింపులు?

    రైతు రుణమాఫీకి బడ్జెట్ లో 30 వేల కోట్లు?

    రైతు భరోసారు బడ్జెట్ లో 15 వేల కోట్లు?

    ఇరిగేషన్ రంగానికి బడ్జెట్ లో 28 వేల కోట్లు?

    వైద్య శాఖకు 15 వేల కోట్ల కెటాయింపు?