మోసం చేశారు, తీవ్రంగా నిరాశపరించారు- బడ్జెట్‌పై హరీశ్ రావు

బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు.

మోసం చేశారు, తీవ్రంగా నిరాశపరించారు- బడ్జెట్‌పై హరీశ్ రావు

Harish Rao : రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్నారు. బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని అభివర్ణించారు. ఆరు గ్యారంటీలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు. ప్రజలను బురిడీ కొట్టించారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

”6 గ్యారెంటీలు నీరుగారిపోయాయి. సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి ఆగమ్యగోచరమైంది. ఎన్నికలప్పుడేమో గ్యారెంటీల గారడీ, ఇప్పుడేమో అంకెల గారడీ. గత ప్రభుత్వం కంటే అధికంగా అప్పులు తెచ్చుకుంటామని ప్రతిపాదించారు. పెన్షన్ దారులను మోసం చేశారు. కోటిమంది అక్క చెల్లెమ్మళ్ళను నిరాశ పరిచారు. చేనేత కార్మికులకు మోసం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని చెప్పడం జోక్. బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి.

ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. కేంద్రం నుంచి ఆశిస్తున్న నిధులు రావు. మా ప్రభుత్వ హయంలో వైద్య శాఖలో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాము. మంత్రి భట్టి.. మాటకు కట్టుబడి ఉంటారా? ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నేను రాజీనామా చేసేందుకు సిద్ధం. మీరు సిద్ధమా?” అని సవాల్ విసిరారు హరీశ్ రావు.

Also Read : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై స్పందించిన కేసీఆర్.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతామని వెల్లడి