14మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు, డ్రగ్స్.. హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం

పక్కా సమాచారంతో రేవ్ పార్టీ జరుగుతున్న అపార్ట్ మెంట్ పై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు దాడి చేశారు.

14మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు, డ్రగ్స్.. హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం

Madhapur Rave Party (Photo Credit : Google)

Madhapur Rave Party : హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. పట్టుబడ్డ వారి నుండి విదేశీ మద్యం, 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల MDMA డ్రగ్, 0.68 గ్రాముల OG Kush డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ కు చెందిన నాగరాజు యాదవ్ జన్మదినం సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.

క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీకి 14 మంది యువకులు, ఆరుగురు యువతులు హాజరయ్యారు. పార్టీలో యువత విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. గోవా నుండి డ్రగ్స్ తెప్పించారు. పక్కా సమాచారంతో రేవ్ పార్టీ జరుగుతున్న అపార్ట్ మెంట్ పై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు దాడి చేశారు. రేవ్ పార్టీ కేసును శేరిలింగంపల్లి పోలీసులకు బదిలీ చేశారు.

Also Read : మ‌ల‌క్‌పేట‌ అంధ బాలికల వసతి గృహంలో అమానుషం.. మంత్రి సీతక్క సీరియస్