ఒలింపిక్స్ 2024లో ఖాతా తెరిచిన భారత్.. మను భాకర్‌కు కాంస్య పతకం

కొరియన్‌ షూటర్లు స్వర్ణం, రజతం సాధించగా, 221.7 పాయింట్లతో భారత్ మూడో..

ఒలింపిక్స్ 2024లో ఖాతా తెరిచిన భారత్.. మను భాకర్‌కు కాంస్య పతకం

పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తన ఖాతా తెరిచింది. కొరియన్‌ షూటర్లు స్వర్ణం, రజతం సాధించగా, 221.7 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.

మను బాకర్ శనివారం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక కొరియన్‌ షూటర్లు ఓయే జిన్‌ 243.2, కిమ్‌ యెజి 241.3 పాయింట్లు సాధించారు.

మెరిసిన తెలుగు తేజం
ఒలింపిక్స్‌ 2024లో తెలుగు క్రీడాకారిణి ఆకుల శ్రీజ కూడా సత్తా చాటింది. టేబుల్ టెన్నిస్ విమెన్స్ సింగిల్స్ విభాగం 64వ రౌండ్‌లో ఆమె గెలుపొందింది. స్వీడన్‌ క్రీడాకారిణి క్రిస్టీనాను 11-4, 11-9, 11-7, 11-8తో ఓడించింది. శ్రీజ 32వ రౌండ్‌కు అర్హత సాధించింది.

మరోవైపు, బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ లోనూ భారట షట్లర్ పీవీ సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. మాల్దీవులకు చెందిన అబ్దల్ రజాక్ పై 29 నిమిషాల్లో సింధు మ్యాచ్ ను ముగించి తదుపరి పోరుకు వెళ్లింది.