Manu Bhaker Biography: దేశం గర్వపడేలా చేసిన మను భాకర్‌.. అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమెను ఇలా..

స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ కావాలని తండ్రిని కోరింది. ఆమెకు తండ్రి రామ్ కిషన్ భాకర్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉండేవారు. ఆమె..

Manu Bhaker Biography: దేశం గర్వపడేలా చేసిన మను భాకర్‌.. అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమెను ఇలా..

Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది హరియాణా అమ్మాయి మను భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె వయసు 22 ఏళ్లు. టీజేనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమె షూటింగ్‌లో రాణిస్తోంది.

దేశానికి చాలా మంది బాక్సర్లు, రెజ్లర్‌ను అందిస్తున్న హరియాణా రాష్ట్రంలోని ఝజ్జర్‌లో మను భాకర్ 2002 ఫిబ్రవరి 18న జన్మించింది. పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలు మను భాకర్ రాణించింది.

మను భాకర్ మార్షల్ ఆర్ట్స్ లోన జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. 2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసిన తర్వాత 14 ఏళ్ల వయస్సులో ఆమె దృష్టి పూర్తిగా షూటింగ్ వైపునకు మళ్లింది. స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ కావాలని తండ్రిని కోరింది. ఆమెకు తండ్రి రామ్ కిషన్ భాకర్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉండేవారు. ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ కొనిచ్చారు.

అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు మను భాకర్‌ని ఒలింపియన్‌గా ప్రపంచం ముందు నిలిపింది. 2017లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూను ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో మను 242.3 రికార్డు స్కోరుతో గెలుపొందింది. ఆ తర్వాత కూడా కామన్తెల్వ్ తో పాటు పలు పోటీల్లో పతకాలు సాధించింది. కాగా, ఆమెకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Also Read: ఒలింపిక్స్ 2024లో ఖాతా తెరిచిన భారత్.. మను బాకర్‌కు కాంస్య పతకం