చంద్రబాబు మళ్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం వస్తుంది- అంబటి రాంబాబు

2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు.

చంద్రబాబు మళ్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం వస్తుంది- అంబటి రాంబాబు

Ambati Rambabu : సీఎం చంద్రబాబు రెండు నెలల్లో అనేక యూ టర్న్స్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అపార్థాలతో అధికారంలోకి వచ్చారు, అపార్థాలతోనే పాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఏవేవో వచ్చేశాయని అన్నారు, తీరా.. అప్పు అని చేతులెత్తేశారు అని విమర్శించారు. చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్.. అని ధ్వజమెత్తారు.

”హామీలు ఇచ్చినప్పుడు లేని భయం అమలు చెయ్యడానికి ఎందుకు భయం..? 2 నెలల్లోనే చంద్రబాబుకి ఓటు వేసినందుకు ప్రజలు తిట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు భూముల రీ సర్వేపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్ళే రీ సర్వే అంటున్నారు. భూముల రక్షణ కోసం రీ సర్వే చేస్తే భూములు కాజేస్తున్నారని దుర్మార్గమైన ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత ఉన్నతమైనది. వివాదాలు తొలగిపోతాయి. జగన్ కు మంచి పేరు వస్తుందని యాక్ట్ ను రద్దు చేశారు. చంద్రబాబు మళ్ళీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. పేరు మార్చినా రూపం మార్చినా యాక్ట్ ను మళ్ళీ తీసుకురావాల్సిందే. భూ సంస్కరణలు అమలు చేసిన వారికే రాయితీలు అంటూ కేంద్రం రూల్ తీసుకొచ్చింది. తల్లికి వందనం వచ్చే ఏడాది కూడా ఇచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. ఉచిత గ్యాస్, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా అన్నీ ఎగ్గొడతారు” అని అంబటి రాంబాబు ఆరోపించారు.

Also Read : వైసీపీకి బిగ్ షాక్‌ తప్పదా? అధికార పార్టీకి దగ్గరవుతున్న ఎమ్మెల్సీలు..!